AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukumar: బన్నీని అలా చూపిద్దామనుకున్నా, కానీ.. పుష్ప క్లైమాక్స్‌పై సుకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Sukumar: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప' చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తొలిసారి పూర్తి మాస్‌ లుక్‌లో కనిపించిన బన్నీ తన నట విశ్వరూపంతో ఫ్యాన్స్‌ను..

Sukumar: బన్నీని అలా చూపిద్దామనుకున్నా, కానీ.. పుష్ప క్లైమాక్స్‌పై సుకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
Narender Vaitla
|

Updated on: Dec 26, 2021 | 4:46 PM

Share

Sukumar: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తొలిసారి పూర్తి మాస్‌ లుక్‌లో కనిపించిన బన్నీ తన నట విశ్వరూపంతో ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. సినిమాలో ఏవైనా మైనస్‌ పాయింట్లు ఉంటే అవి బన్నీ నటనతో మరుగున పడ్డాయి అంటూ సినిమా రివ్యూ సమయంలో చాలా మంది అభిప్రాయపడ్డారు. డిసెంబర్‌ 17న విడదులైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ. 200 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి కలెక్షన్ల సునామిని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఇప్పట్లో మరో బడా సినిమా విడుదల లేకపోవడంతో పుష్ప కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు సుకుమార్‌ ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. సినిమా క్లైమాక్స్‌లో విలన్‌, హీరోల మధ్య వచ్చే సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సన్నివేశంలో బన్నీతో పాటు ఫహద్‌ ఫాజిల్‌కు కూడా అర్థనగ్నంగా కనిపిస్తారు. అయితే తొలుత సుకుమార్‌ ఈ సన్నివేశంలో వీరిద్దరినీ నగ్నంగా చూపించాలనుకున్నారట.

కానీ తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సీన్స్‌ను అంగీకరించరని భావించి.. మార్పులు చేశామని చెప్పుకొచ్చారు సుకుమార్. ఇక పార్ట్ 2 గురించి కూడా సుకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ప రైజ్‌లో కేవలం పాత్రల పరిచయం మాత్రమే చేశామని, అసలు కథ ఉండేది పుష్ప ‘ది రూల్‌’లోనే ఉంటుందని సుకుమార్‌ చెప్పుకొచ్చారు. ఇక పార్ట్‌ 2 సినిమా షూటింగ్‌ ఫిబ్రవరిలో మొదలు కానున్న విషయం తెలిసిందే.

Also Read: GATE Exam: ఇంజనీరింగ్ తర్వాత గేట్ పరీక్షకు సిద్దమవుతున్నారా.. గేట్ ప్రయోజనాలు, ప్రిపరేషన్ ప్రణాళిక ఎలా ఉండాలి?

యువతికి కోడిపుంజు చుక్కలు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ !!

Bride in Helicopter: హెలికాఫ్టర్‌లో అత్తింటికి కొత్త కోడలు.. చూసేందుకు ఎగబడిన జనం !! వీడియో