Salman Khan : మెగాస్టార్ మూవీలో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన బాలీవుడ్ స్టార్.. డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్
మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు బాస్.
Salman Khan : మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు బాస్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా మరి కొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో మెగాస్టార్ తోపాటు జూనియర్ మెగాస్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకోసం మెగా ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆచార్య సినిమాలో చరణ్ , చిరు ఇద్దరు నక్సలైట్ లుగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమా పై బజ్ ను క్రియేట్ చేశాయి. ఏప్రిల్ 1న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ మూవీని రీమేక్ చేస్తున్నారు చిరు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ముంబైలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సల్మాన్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. షూటింగ్ స్పాట్ లోని ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సల్మాన్ గుడ్ బై చెప్పారని తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ షూటింగ్ పూర్తైన నేపథ్యంలో దర్శకుడు మోహన్ రాజా ఆయనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. సల్మాన్ ఖాన్ తో వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని.. షూటింగ్ ఎంతో మెమొరబుల్ గా సాగిందని మోహన్ రాజా అన్నారు.
Finished an Amazing Schedule with the Mighty Man,Sweetness Personified Dearmost Bhai @beingsalmankhan Thanks Bhai for Making this So Comfortable and So Memorable ? And Thanks to OUR pillar of Support @kchirutweets for making this happen for Our #GodFather@MusicThaman & Team pic.twitter.com/2ys8CUy6jo
— Mohan Raja (@jayam_mohanraja) March 24, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :