‘Mishan Impossible’: విడుదలకు సిద్దమైన తాప్సీ సినిమా.. ‘మిషన్ ఇంపాజిబుల్’ వచ్చేది ఎప్పుడంటే..
అందాల భామ తాప్సీ పన్ను కు తెలుగుతోపాటు హిందీలోనూ మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝమ్మంది నాదం సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ భామ
Taapsee Pannu: అందాల భామ తాప్సీ పన్నుకు తెలుగుతోపాటు హిందీలోనూ మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝమ్మంది నాదం సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ భామ. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో యువతను ఆకర్షించింది ఈ చిన్నది. ఆతర్వాత ఈ బ్యూటీకి తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. అయితే ఈ అమ్మడు చేసిన సినిమాలు హిట్ అయినప్పటికీ తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది. ఆ తర్వాత ఈ తాప్సీ బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంటూ మంచి సక్సెస్ లు అందుకుంది. అక్కడ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా తాప్సీ తెలుగులో ఓ సినిమా చేస్తుంది. తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ `మిషన్ ఇంపాజిబుల్`. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్జే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కాగా, ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ప్రమోషన్‌లో భాగంగా ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో నటించిన ముగ్గురు పిల్లల నటన హైలైట్ గా నిలిచింది. దావూద్ ఇబ్రహం అనే వ్యక్తిని పట్టుకునే క్రమంలో వారికి ఎదురైన సమస్యలు ఎంటర్టైనింగ్ గా వున్నాయి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా తాప్సీ నటించింది. ఇటీవలే విడుదలైన మొదటి పాటకు మంచి రెస్సాన్స్ వచ్చింది. దానితో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. తెలుగులో డిఫరెంట్ సినిమాగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కూడా ఏప్రిల్ 1 న విడుదలకు సిద్ధం అవుతుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఒకే రోజు ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ సినిమాలు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటాయి చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :