RRR Movie: రామ్ చరణ్‌ను కొట్టిన తారక్.. తట్టుకోలేక ఏడ్చేసిన బుడ్డోడు..

ఆర్ఆర్ఆర్ ఇప్పుడు ఎక్కడ విన్న ఇదే పేరు.. థియేటర్స్ మొత్తం జై ఎన్టీఆర్, జై చరణ్ నినాలతో హోరెత్తిపోతున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా శుక్రవారం (25న ) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

RRR Movie: రామ్ చరణ్‌ను కొట్టిన తారక్.. తట్టుకోలేక ఏడ్చేసిన బుడ్డోడు..
Ram Charan Fan
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 26, 2022 | 8:15 AM

RRR Movie: ఆర్ఆర్ఆర్ ఇప్పుడు ఎక్కడ విన్న ఇదే పేరు.. థియేటర్స్ మొత్తం జై ఎన్టీఆర్, జై చరణ్ నినాలతో హోరెత్తిపోతున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా శుక్రవారం (25న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు వీరులను కలిపి ఈ సినిమాలో చూపించారు జక్కన్న. యంగ్ టైగర్ కొమురం భీమ్ గా.. మెగాపవర్ స్టార్ అల్లూరి సీతారామ రాజుగా నటించారు అనడం కంటే జీవించారు అంటున్నారు సినిమా చూసిన జనాలు. పాన్ ఇండియా మూవీ రూపొందిన ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఊహించిన దానికంటే మించి రాజమౌళి సినిమాను తెరకెక్కించారని అంటున్నారు అభిమానులు. ఇద్దరు స్టార్ హీరోస్ తలపడుతుంటే రెండు సింహాలు కొట్లాడుకున్నట్టు ఉందని అంటున్నారు చూసినవాళ్లంతా.. ఇక జక్కన్న మార్క్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ బాహుబలి 2 రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ను ఎక్కడ హర్ట్ అవ్వకుండా సినిమా తీయడం అంటే చాలా కష్టం.. కానీ జక్కన్న మాత్రం సినిమాలో ఇద్దరు హీరోలు ఫైట్ చేసుకుంటున్నట్టు చూపించలేదు.. ఇద్దరు వీరులు పోరాడుతున్నట్టే చూపించారు.. సినిమా చూస్తున్నంతసేపు మనకు రామ్ చరణ్ , ఎన్టీఆర్ కనిపించరు.. అల్లూరి కొమురం భీమ్ మాత్రమే మన కళ్ళ ముందు మెదులుతారు. అయితే కొంతమంది మాత్రం మా హీరో గొప్ప.. మా కేక అని రివర్స్ లో వాదిస్తున్నారు. తాజాగా ఓ చిన్న పిల్లవాడైతే ఏకంగా థియేటర్ లోనే ఇచ్చేశాడు. ఇప్పుడు ఈవీడియో వైరల్ అవుతుంది. తన అభిమాన హీరో దెబ్బలు తినడాన్ని చూసి తట్టుకోలేక పోయాడు ఆ బుల్లి ఫ్యాన్. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ , తారక్ మధ్య ఓ భారీ ఫైట్ సీన్ ఉంటుంది. ఈ ఫైట్ లో తారక్ చరణ్ ఒకరినొకరు కొట్టుకుంటారు. తారక్ చరణ్ ను కొట్టడం తో ఓ చిన్నారి హర్ట్ అయ్యాడు. ఎన్టీఆర్ చరణ్ కు కొట్టడమేంటి అంటూ.. ఎందుకు అలా కొడుతున్నాడు అంటూ థియేటర్ లో ఏడ్చేశాడు.. పక్కనే ఉన్న అతడి తల్లి.. అది సినిమా నాన్నా.. నిజంగా కొట్టుకోరు.. అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఈవీడియో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bhanu Shree: కైపెక్కిస్తున్న అందాలతో మెస్మరైజ్ చేస్తున్న భాను లేటెస్ట్ పిక్స్ వైరల్

Aparna Balamurali: నాట్య మయూరి గా మారిన అపర్ణ బాలమురళి.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్

RRR: దద్దరిల్లుతున్న RRR థియేటర్లు… రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!