
సల్మాన్ ఖాన్, అట్లీ సినిమా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కీలకపాత్రలో నటించనున్నారనే టాక్ సైతం నడిచింది. కానీ ఇప్పుడు కొన్ని నివేదికల ప్రకారం ఈ సినిమా తాత్కాలికంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ వార్త సల్మాన్ అభిమానులకు షాకిచ్చింది. ఈ సంఘటన వెనుక ఒక పెద్ద పరిణామం జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సన్ పిక్చర్స్ ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ సినిమాలో కమల్ హాసన్ లేదా రజనీకాంత్ లను నటింపజేయాలని ప్రణాళికలు వేశారు. అయితే ఈ చిత్రానికి ఇద్దరూ ఒప్పుకోలేదని సమాచారం.
దీంతో ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్ట్‌ను మార్చాలని భావిస్తున్నారట మేకర్స్. ఈ చిత్రంలో ముఖ్య పోషించడానికి రజనీకాంత్, కమల్ హాసన్ సిద్ధంగా లేరని చెబుతున్నారు. ఈ కారణంగా, అట్లీ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్‌ను సంప్రదించడానికి ప్రయత్నించాడు. ఇద్దరి మధ్య సంబంధాన్ని ఏర్పరచే పని సల్మాన్ ఖాన్ చేసాడు. అంతా బాగానే జరుగుతుండగా, సన్ పిక్చర్స్ దక్షిణాది హీరోలను మాత్రమే కోరుకుంటున్నట్లు సమాచారం.
దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సన్ పిక్చర్స్ తో నేరుగా చర్చలు జరుపుతున్నారు. మార్చి నాటికి ఈ సినిమా గురించి స్పష్టమైన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అట్లీ హిందీలో జవాన్ సినిమాతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..