Saif Alikhan: సైఫ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది..? డాక్టర్స్ ఏమన్నారంటే..
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై గురువారం అర్దరాత్రి కత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. జనవరి 16న రాత్రి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన ఓ దొంగ అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడిని విచారిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై ఓ దొంగ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో బీటౌన్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ప్రస్తుతం సైఫ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న సైఫ్ కు శస్త్ర చికిత్స చేసి అతడి వెన్నుముక నుంచి రెండు అంచుల కత్తిని తొలగించారు వైద్యులు. తాజాగా సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితిని తెలియజేశారు లీలావతి ఆసుపత్రి వైద్యులు. ప్రస్తుతం సైఫ్ ను ఐసీయూ నుంచి నార్మల్ గదికి తరలించినట్లు తెలుస్తోంది.
డాక్టర్స్ ఏమన్నారంటే..
సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు బాగానే ఉన్నారని. నిన్న ఉదయమే సైఫ్‌కు ఆపరేషన్ చేసి కత్తిని తొలిగించామని.. ఆపరేషన్ తర్వాత అతడిని ఐసీయూలోనే ఉంచామని… ఈరోజు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చీఫ్ న్యూరోసర్జన్ నితిన్ డాంగే తెలిపారు. “మేము ఈ రోజు మరోసారి సైఫ్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించాము. వెన్నుముకు లోతైన గాయం అయ్యింది కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సైఫ్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆయన ఇప్పుడు నడవగలుగుతున్నారు. నడుస్తున్నప్పుడు తీవ్రమైన నొప్పి లేదా ఇతర ఇబ్బందులను ఇప్పటికైతే గుర్తించలేదు. ఆయనను ఐసీయూ నుంచి ప్రత్యేక గదిలోకి మారుస్తున్నాము. అలాగే వెన్ను నుంచి కత్తి తొలిగించి సర్జరీ చేశాము. ఈరోజు ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్‌కి మారుస్తున్నామని డాక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గా ఉందని డా. డాంగే అన్నారు.
సైఫ్ అలీఖాన్ శరీరంపై 6 చోట్ల కత్తిపోట్లు పడ్డాయి. ఆరు గాయాలలో రెండు లోతుగా ఉన్నాయి. నిన్న శస్త్ర చికిత్స అనంతరం సైఫ్ వెన్నుముక నుంచి కత్తిని తొలిగించారు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ పూర్తిగా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..




