Rajeev Rayala |
Updated on: Jan 09, 2023 | 12:49 PM
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. మలయాళ మూవీ ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ భామ.
తొలి సినిమాతోనే తన నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాలో సాయి పల్లవి చాలా నేచురల్ గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిదా సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ రాణిస్తోంది. అలాగే తమిళ్ లోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. గ్లామర్ షో చేయకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తూ ఆకట్టుకుంటోంది ఈ అమ్మడు.
అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి ఆకట్టుకుంది సాయి పల్లవి. చివరిగా గార్గి సినిమాతో ప్రేక్షకులను అలరించింది.
ఇదిలా ఉంటే ఇటీవల సాయి పల్లవి సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు. ఇంతవరకు తన నెక్స్ట్ సినిమా ఏంటి అనేది క్లారిటీ ఇవ్వలేదు.
ఇటీవలే పుట్టపర్తి సాయి బాబా నిలయానికి వెళ్లారు పల్లవి. అక్కడే న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నారు.
తాజాగా ఎత్తియమ్మన్ మాత టెంపుల్ లో దర్శనమిచ్చింది సాయి పల్లవి. తమిళనాడులో కట్టుపాక్కం లోని అమ్మన్ నగర్ లోని ఎత్తియమ్మన్ టెంపుల్ లో అక్కడ సంప్రదాయ వస్త్రాలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నది సాయి పల్లవి