AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: స్టేజ్‌పై కంటతడి పెట్టుకున్న సమంత.. శాకుంతలం ప్రెస్‌మీట్‌లో ఆ మాటవినగానే భావోద్వేగం.

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. గుణ శేఖర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. గుణశేఖర్‌ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కెరీర్‌లో సరైన హిట్‌లు లేక సతమతమవుతోన్న గుణ శేఖర్‌కు ఈ సినిమా చాలా కీలకంగా మారింది...

Samantha: స్టేజ్‌పై కంటతడి పెట్టుకున్న సమంత.. శాకుంతలం ప్రెస్‌మీట్‌లో ఆ మాటవినగానే భావోద్వేగం.
Samantha Gets Emotional
Narender Vaitla
|

Updated on: Jan 09, 2023 | 1:39 PM

Share

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. గుణ శేఖర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. గుణశేఖర్‌ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కెరీర్‌లో సరైన హిట్‌లు లేక సతమతమవుతోన్న గుణ శేఖర్‌కు ఈ సినిమా చాలా కీలకంగా మారింది. దీంతో ఈ సినిమాపైనే అన్ని ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సోమవారం చిత్ర యూనిట్‌ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. అనంతరం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా స్టేజ్‌పై ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.

స్టేజ్‌పై చిత్ర దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ.. సినిమాకు హీరో సమంతా, అని సినిమా వెనకాల హీరో దిల్‌రాజు అని తెలిపారు. ఈ సందర్భంగా గుణశేఖర్‌ ఎమోషన్‌కు గురయ్యారు. ఒకానొక సమయంలో ఏంగా కంటతడి పెట్టుకున్నాడు. ఫిలిం మేకర్స్‌ మంచి సినిమా తీయాలంటే మేకర్స్‌ కావాలంటూ గుణశేఖర్‌ ఎమోషన్‌ అయ్యారు. దీంతో అక్కడే కూర్చున్న సమంత సైతం ఒక్కసారిగా ఎమోషన్‌ అయ్యారు. మనసులో నుంచి ఉప్పొంగుతూ వచ్చిన బాధతో సమంత ఏడ్చేసింది. దీంతో సభకు హాజరైన కొందరు అభిమానులు అరడవంతో సమంత మళ్లీ నవ్వేసింది. సమంత భావోద్వేగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇక ఈవెంట్‌లో మాట్లాడిన సమంత… దర్శకుడు గుణశేఖర్‌, నిర్మాత దిల్‌రాజుకు ధన్యవాదాలు తెలిపారు. కాళిదాసు 5వ శతాబ్ధంలో రాసిన శాకుంతలలానికి గుణశేఖర్‌ తనను ఎంచుకోవడం తన అదృష్టం అని చెప్పుకొచ్చింది. జీవితంలో తాను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా సినిమా నన్ను ప్రేమించడం మాత్రం తగ్గలేదు. శాకుంతలంతో ఈ ప్రేమ మరింత పెరుగుతుందని సమంత ధీమా వ్యక్తం చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..