Budda Venkanna: ‘కేవలం కాళ్లు నాకుతావ్ అనుకున్నా…కానీ’.. వర్మకు బుద్దా వెంకన్న దిమ్మతిరిగే కౌంటర్
ఇటీవల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్‌ను సైతం టార్గెట్ చేస్తున్నారు. ట్వీట్లు, వీడియోలతో రచ్చ లేపుతున్నాడు. అయితే..

టీడీపీనేతలు-డైరెక్టర్ ఆర్జీవీ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. నిన్న చంద్రబాబు,పవన్ భేటీపై రాంగోపాల్‌వర్మ చేసిన ట్వీట్ పొలిటికల్ దుమారం రేపుతోంది. కేవలం డబ్బు కోసం కాపులను కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదని ట్వీట్ చేశారు ఆర్జీవి. అంతేకాదు RIP కాపులు, కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు అంటూ ట్వీట్ చేశారు వర్మ. రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్‌కి, టీడీపీనేత బుద్ధా వెంకన్న రీ-ట్వీట్ చేశారు. కామంతో కాళ్లు నాకావ్ అనుకున్నా కానీ..పేటీఎం డబ్బుకోసం ఏమైనా నాకుతావని ఊహించలేదని ఘాటుగా ట్వీట్ చేశారు. RIP ఆర్జీవీ, కంగ్రాట్స్ జగన్‌రెడ్డి అంటూ ట్వీట్ చేశారు.
ఇటీవల బిగ్‌బాస్ ఫేమ్..అశురెడ్డిని ఓ ఇంటర్వ్యూ చేస్తూ రాంగోపాల్‌వర్మ ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. ఆమె కాళ్లు నాకుతూ అందానికి సెల్యూట్ కొట్టాడు ఆర్జీవి. ఇదే విషయాన్ని బుద్ధావెంకన్న ప్రస్తావిస్తూ, నీవు కేవలం కాళ్లు నాకుతావ్ అనుకున్నా…కానీ డబ్బుకోసం ఏదైనా నాకుతావని ఊహించలేదని ట్వీట్ చేశాడు.
కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా, కానీ పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు… #RIPRGV, కంగ్రాట్స్ జగన్ రెడ్డి. @ysjagan @RGVzoomin https://t.co/7XZnvrnraH pic.twitter.com/HcoPZE4V8J
— Budda Venkanna (@BuddaVenkanna) January 9, 2023
ఇటీవల చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై రాంగోపాల్ వర్మ ట్వీట్లు వైసీపీ మంత్రులను మించిపోయేలా ఉన్నాయి. డైరెక్ట్‌గా చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఇటీవల వరుస ట్వీట్లు, కామెంట్లతో ఫైరవుతున్నారు రాంగోపాల్‌వర్మ. మొన్న గుంటూరు ఘటనపై కూడా చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఆర్జీవీ కామెంట్ చేయడం కలకలం రేపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి