Sai Pallavi: ఆ రూమర్లకు చెక్‌ పెట్టిన సాయి పల్లవి.. ఇదెంతో స్పెషల్‌.. ఆశీర్వాదాలు కావాలంటోన్న న్యాచురల్‌ బ్యూటీ

ఆ మధ్యన కొత్త సంవత్సరం వేడుకలు, పండగలకు గుళ్లో కనిపించి కనువిందు చేసింది సాయి పల్లవి. అందరిలా ఓ సాధారణ యువతిలా కూర్చొని ధ్యానం చేస్తున్న ఫొటోలు నెట్టింట్లో తెగ వైరలయ్యాయి. సోషల్ మీడియాలో తన ఫొటోలు వస్తున్నాయి కానీ సినిమాలపై ఎలాంటి అప్‌డేట్‌ రాకపోవడంతో ఆమె ఫ్యాన్స్‌ ఫీలయ్యారు.

Sai Pallavi: ఆ రూమర్లకు చెక్‌ పెట్టిన సాయి పల్లవి.. ఇదెంతో స్పెషల్‌.. ఆశీర్వాదాలు కావాలంటోన్న న్యాచురల్‌ బ్యూటీ
Sai Pallavi
Follow us

|

Updated on: May 06, 2023 | 4:13 PM

గతేదాది విరాట పర్వం, గార్గి చిత్రాల్లో నటించింది సాయి పల్లవి. అయితే ఆ తర్వాత ఆమె వెండితెర మీద కనిపించలేదు. తర్వాతి ప్రాజెక్టులపై కూడా ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వలేదు. దీంతో సాయిపల్లవి సినిమాలు మానేస్తుందని, త్వరలోనే పెళ్లి చేసుకుంటుందంటూ ప్రచారం జరిగింది. అంతేకాదు తన డాక్టర్ వృత్తి మీద సాయి పల్లవి ఫోకస్ పెట్టిందని, ఓ ఆస్పత్రి కూడా కడుతున్నట్లు రూమర్లు వచ్చాయి. ఆ మధ్యన కొత్త సంవత్సరం వేడుకలు, పండగలకు గుళ్లో కనిపించి కనువిందు చేసింది సాయి పల్లవి. అందరిలా ఓ సాధారణ యువతిలా కూర్చొని ధ్యానం చేస్తున్న ఫొటోలు నెట్టింట్లో తెగ వైరలయ్యాయి. సోషల్ మీడియాలో తన ఫొటోలు వస్తున్నాయి కానీ సినిమాలపై ఎలాంటి అప్‌డేట్‌ రాకపోవడంతో ఆమె ఫ్యాన్స్‌ ఫీలయ్యారు. నిజంగానే సాయి పల్లవి సినిమాలు మానేస్తుందనుకున్నారు. అయితే ఈ రూమర్లకు తాజాగా చెక్‌ పెట్టింది న్యాచురల్‌ బ్యూటీ. ఎట్టకేలకు తన కొత్త సినిమా ప్రారంభమైంది. ఆ మధ్యన కథ నచ్చి, తన పాత్ర బాగుంటే సినిమాలు చేస్తుందని చెప్పుకొచ్చిన సాయి పల్లవి ఇప్పుడు ఆ మాటను నిజం చేసింది.

సాయి పల్లవి తన తర్వాతి సినిమా కమల్ హాసన్ బ్యానర్‌లో చేయనుంది. ఇందులో శివ కార్తికేయన్‌ హీరోగా నటించనున్నాడు. జీవి ప్రకాశ్‌కుమార్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా జరిగాయి. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. ముఖ్యంగా సాయి పల్లవి స్టిల్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. న్యాచురల్‌ బ్యూటీ ఎంతో క్యూట్‌గా ఉందంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..