Sai Pallavi: ‘అమరన్’లో నటించేందుకు ఆ కండీషన్ పెట్టిన సాయి పల్లవి.. హీరోతో పాటు తనకు కూడా..
గార్గి తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది సాయి పల్లవి. ఆమె తీరు చూసి సినిమాలు మానేస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయింది. సాయి పల్లవి నటిస్తోన్న తాజా చిత్రం అమరన్. శివ కార్తీకేయన్ హీరోగా నటిస్తున్నాడు. కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
సాయి పల్లవి ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్. సినిమాల విషయంలో ఆమె ఇతర నటీమణుల కంటే చాలా భిన్నంగా ఆలోచిస్తుంటుంది. రొమాంటిక్, గ్లామర్ పాత్రలను ఏ మాత్రం అంగీకరించదు. స్కిన్ షోకు కూడా నో చెబుతుంది. ఇక సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యముంటేనే పచ్చ జెండా ఊపుతుంది. హీరో సెంట్రిక్ సినిమాలైనా తన రోల్స్ కు ఇంపార్టెంట్ ఉండాలని దర్శక నిర్మాతలకు చెబుతుంది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి నటించిన ‘అమరన్’ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ గమనిస్తే ఇది హీరో సెంట్రిక్ మూవీ అనిపిస్తుంది. అయితే ఈ సినిమాకు ఒకే చెప్పడానికి ముందే డైరెక్టర్ కు ఓ కండీషన్ పెట్టిందట సాయి పల్లవి. అదేంటంటే.. సాధారణంగా బయోపిక్ సినిమాల్లో కథానాయకుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యముండదు. అయితే ‘అమరన్’ సినిమా మేజర్ కథ కావడంతో హీరోకు ప్రాధాన్యముంటుందని, అదే సమయంలో హీరోయిన్ పాత్రకు సమాన అవకాశం ఉందని దర్శకుడు రాజకుమార్ పేరిస్వామి అన్నారు. ‘ నేను సినిమాల్లో హీరోయిన్లకు సమాన అవకాశాలు, సమాన స్క్రీన్ టైమ్ కావాలని కోరుకునే వాడిని. అందుకే అమరన్ లో సాయి పల్లవి పాత్రకు కూడా చాలా ప్రాధాన్యముంది’ అని డైరక్టర్ చెప్పుకొచ్చారు.
ఇక సాయి పల్లవి మాట్లాడుతూ ‘డైరెక్టర్ తో గొడవపడి నా పాత్రకు ప్రాధాన్యముండాలని కండిషన్ పెట్టిన తర్వాతే సినిమాలో నటించేందుకు అంగీకరించాను’ అని చెప్పుకొచ్చింది. ‘సాధారణంగా బయోపిక్ సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత తక్కువ గా ఉంటుంది.. సినిమా నిడివి లేక మరేదైనా కారణాల వల్ల హీరోయిన్లు నటించిన సీన్లను కట్ చేస్తారు. కానీ ‘అమరన్’ సినిమాలో నటించే ముందు దర్శకుడు రాజ్‌కుమార్ నాకు మాట ఇచ్చారు. మేజర్ ముకుందన్ పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో నేను చేస్తున్న రెబెక్కా వర్గీస్ పాత్రకు అంతే ప్రాధాన్యముంటుందని డైరెక్టర్ భరోసా ఇచ్చారు.
అమరవీరుడు మేజర్ ముకుందన్ కథ ఆధారంగా సాయి పల్లవి నటించిన చిత్రం అమరన్. శివకార్తికేయన్ మేజర్ ముకుందన్ పాత్రలో నటించారు. ముకుందన్ భార్య రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. కమల్ హాసన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అక్టోబర్ 31న సినిమా విడుదల కానుంది. సాయి పల్లవి ‘అమరన్’తో పాటు బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణం’లో నటిస్తోంది. తెలుగులో తండేల్ సినిమాలో నటిస్తోంది. అలాగే అమీర్ ఖాన్ కుమారుడి కొత్త సినిమాలో నటించాడు. దీనికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.