Sai Pallavi: సాయి పల్లవికి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఇప్పటికీ వాటిని జాగ్రత్తగా దాచుకుందట..

సాయి పల్లవి.. సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో ఈ హీరోయిన్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతేడాది విరాట పర్వం, గార్గి సినిమాల్లో కనిపించిన ఈ న్యాచురల్‌ బ్యూటీ ఆ తర్వాత వెండితెరపై కనిపించలేదు. దీంతో సాయి పల్లవి సినిమాలకు గుడ్‌ బై చెప్పేసిందన్న ప్రచారం జరిగింది. అయితే కథ నచ్చితే కచ్చితంగా సినిమా చేస్తానన్న ఈ సొగసరి తన మాటను నిలబెట్టుకుంది.

Sai Pallavi: సాయి పల్లవికి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఇప్పటికీ వాటిని జాగ్రత్తగా దాచుకుందట..
Sai Pallavi
Follow us

|

Updated on: May 09, 2023 | 7:00 AM

సాయి పల్లవి.. సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో ఈ హీరోయిన్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతేడాది విరాట పర్వం, గార్గి సినిమాల్లో కనిపించిన ఈ న్యాచురల్‌ బ్యూటీ ఆ తర్వాత వెండితెరపై కనిపించలేదు. దీంతో సాయి పల్లవి సినిమాలకు గుడ్‌ బై చెప్పేసిందన్న ప్రచారం జరిగింది. అయితే కథ నచ్చితే కచ్చితంగా సినిమా చేస్తానన్న ఈ సొగసరి తన మాటను నిలబెట్టుకుంది. ఇటీవల తన కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. శివ కార్తికేయన్‌ హీరోగా కమల్‌ హాసన్‌ నిర్మిస్తోన్న ఓ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా కనిపించనుంది. జీవి ప్రకాశ్‌ కుమార్‌ స్వరాలు సమకూరుస్తోన్న ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. వీటిని చూసిన ఆమె అభిమానులు తెగ హ్యాపీగా ఫీలయ్యారు. మళ్లీ సిల్వర్‌ స్క్రీన్‌ పై సాయి పల్లవిని చూసేందుకు ఎదురుచూస్తున్నామంటూ కామెంట్ల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే ఇవాళ (మే9) సాయి పల్లవి పుట్టిన రోజు. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు లేడీ పవర్‌ స్టార్‌కు బర్త్‌ డే విషెస్‌ చెబుతున్నారు.

మరి సౌతిండియన్‌ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ క్రేజ్‌ తెచ్చుకున్న సాయి పల్లవికి ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా? గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడిన తన ఫేవరెట్‌ హీరోల లిస్టును బయటపెట్టింది. తనకు కమల్ హాసన్, సూర్య, మమ్ముట్టి అంటే ఎంతో ఇష్టమని వీరిలో కమల్ హాసన్ అంటే మరీ ఇష్టమని సాయిపల్లవి తెలిపింది. కమల్ అంటే తనకి ఎంతిష్టమంటే ఏకంగా ఆయన నటించిన సినిమా కు సంబంధించిన పోస్టర్స్ కట్ చేసి తన దగ్గర దాచుకున్నానని, ఇప్పటికీ ఆ పోస్టర్స్ అన్నీ తన దగ్గరే ఉన్నాయని తెలిపింది సాయి పల్లవి. అలాగే జ్యోతిక తన ఫేవరెట్‌ హీరోయిన్‌ అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..