ఎంత పని చేశావ్ అన్న..! ఆ సినిమా ఎలా మిస్ అయ్యావ్..!! ప్రేమకావాలి మిస్ చేసుకున్న మెగా హీరో
యూత్ కు కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ కావడంతో మంచి హిట్ అందుకుంది ఈ సినిమా. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ప్రేమకావాలి సినిమా సాంగ్స్ మనకు వినిపిస్తూనే ఉంటాయి. అంతలా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యాయి. ఈ సినిమాకు స్వయంవరం, నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి లాంటి క్లాసిక్ హిట్స్ అందించిన కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు.
సీనియర్ నటుడు సాయి కుమార్ కొడుకు ఆది సాయి కుమార్ హీరోగా పరిచయమైన సినిమా ప్రేమ కావలి. అందమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కథ కథనంతో పాటు ఆది సాయి కుమార్ నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్ కు కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ కావడంతో మంచి హిట్ అందుకుంది ఈ సినిమా. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ప్రేమకావాలి సినిమా సాంగ్స్ మనకు వినిపిస్తూనే ఉంటాయి. అంతలా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యాయి. ఈ సినిమాకు స్వయంవరం, నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి లాంటి క్లాసిక్ హిట్స్ అందించిన కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఓ మెగా హీరో చేయసిన మూవీ.. కానీ ఆ ఛాన్స్ ఆది సాయికుమార్‌కు వచ్చిందట.
ఇది కూడా చదవండి : Tollywood : టాలీవుడ్‌లో తోపులు ఈ ఇద్దరూ.. ఎవరో గుర్తుపట్టారా..?
ఈ విషయాన్ని విజయ్ భాస్కర్ స్వయంగా తెలిపారు. ఆ మెగా హీరో ఎవరో తెలుసా.? మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలో పరిచయం అయ్యి. విభిన్న కథలను ఎంచుకుంటూ హీరోగా రాణిస్తున్న సాయి ధరమ్ తేజ్. విజయ్ భాస్కర్ రీసెంట్ గా ఉషా పరిణయం అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ భాస్కర్ స్టేజ్ పై మాట్లాడుతూ..
ఇది కూడా చదవండి :Raviteja : ఒరేయ్ ఆజామో.. మన మాస్ రాజా కూతురు మెంటలెక్కించిందిగా..!!
పవన్ కళ్యాణ్ గారి నిర్మాణంలో సాయి ధరమ్ తేజ్‌ను నేనే పరిచయం చేయాలి. అనుకోకుండా అది తప్పింది. అదే సినిమా ఆదితో ప్రేమ కావాలి అని తీశాను. అని అన్నారు. ఆ రోజుకు సాయి ఎలా ఉన్నడో.. ఈ రోజుకు అలానే ఉన్నాడు. అదే వినయం, అదే సంస్కారం. నేను చిరంజీవిగారు ఎలా వినయంగా ఉంటారో మళ్లీ సాయి ధరమ్ తేజ్ దగ్గర చూసాను అన్నారు విజయ్ భాస్కర్. అలాగే సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ఆ సమయంలో మా సినిమాలు షిఫ్ట్ అయ్యాయి.. ఆది రేయ్ సినిమా చేయాలి.. నేను ప్రేమకావాలి చేయాలి.. కానీ నేను రేయ్ చేశాను.. ఆది ప్రేమకావాలి చేశాడు అని తేజ్ తెలిపాడు. ఇక ఇప్పుడు ప్రేమకావాలి సినిమా సాయి ధరమ్ తేజ్ చేసి ఉంటే నెక్స్ట్ లెవల్ లో ఉండేది అని కొందరు మెగా ఫ్యాన్స్, మరికొంతమంది ఎంత పని చేశావ్ అన్న..! ఆ సినిమా ఎలా మిస్ అయ్యావ్..!! అని కామెంట్స్ చేస్తున్నారు.
సాయి ధరమ్ తేజ్ ఇన్ స్టా ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి