Taapsee Pannu: మరీ అంత పొగరు పనికి రాదు..! తాప్సీ పై మండిపడుతున్న నెటిజన్లు
సూటిగా మాట్లాడుతూ కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. అక్కడ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తో ఈ అమ్మడు పెద్ద వారే పెట్టుకుంది. బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ రాణిస్తుంది ఈ చిన్నది. ఇదిలా ఉంటే తాజాగా తాప్సీ పన్ను చేసిన పనికి సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ హీరో హీరోయిన్ గా పరిచయం అయ్యి.. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ స్టార్ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మల్లో తాప్సీ పన్ను. ఈ అమ్మడు సినిమాలతో పాటు వివాదాలతోనూ బాగానే వార్తల్లో నిలుస్తోంది. సూటిగా మాట్లాడుతూ కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. అక్కడ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తో ఈ అమ్మడు పెద్ద వారే పెట్టుకుంది. బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ రాణిస్తుంది ఈ చిన్నది. ఇదిలా ఉంటే తాజాగా తాప్సీ పన్ను చేసిన పనికి సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె పై చాలా సార్లో నెటిజన్స్ ట్రోల్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆమె నెటిజన్స్ ఆగ్రహానికి గురయ్యింది. అభిమానంతో సెల్ఫీ అడిగిన యువతితో తాప్సీ పన్ను ప్రవర్తించిన తీరు ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి : Tollywood : టాలీవుడ్‌లో తోపులు ఈ ఇద్దరూ.. ఎవరో గుర్తుపట్టారా..?
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ, ఈ ఘటన ఎక్కడ జరిగింది? నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అనే విషయానికొస్తే.. తాప్సీ పన్ను ‘ఖేల్ ఖేల్ మే’ చిత్రంలో నటించింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. తాజాగా ఈ సినిమా పాటల రిలీజ్ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా మందిని ఆహ్వానించారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన అనన్య ద్వివేది అనే యువతి కూడా వచ్చింది. అనన్యతో తాప్సీ పన్ను అణిచితంగా ప్రవర్తించింది.
ఇది కూడా చదవండి :Raviteja : ఒరేయ్ ఆజామో.. మన మాస్ రాజా కూతురు మెంటలెక్కించిందిగా..!!
పాట విడుదలైన తర్వాత, అనన్య ద్వివేది తాప్సీ పన్ను వద్దకు వెళ్లి సెల్ఫీ కోరింది. అయితే తాప్సీ అందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా తీసిన వీడియోను సోషల్‌మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్స్ మండిపడుతున్నారు. అంత పొగరు పనికి రాదు అంటూ జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ అయినంత మాత్రాన ఇలాంటి ప్రవర్తన సరికాదని పలువురు విమర్శలు చేస్తున్నారు. దీనిపై తాప్సీ ఇంకా స్పందించలేదు. ఈ వైరల్ వీడియో పై సెల్ఫీ అడిగిన యువతి అనన్య ద్వివేది కూడా స్పందించింది. ‘ఈ వీడియోలో ఉన్నది నేనే. అక్కడ చాలా కెమెరాలు ఆమెను ఫోటో తీసుతున్నా కూడా నన్ను సెల్ఫీ తీసుకోవద్దు అని ఆమె ఎందుకు అన్నారో అర్థం కావడం లేదు. తన పాటను ప్రమోట్ చేయడానికి మమ్మల్ని ఆహ్వానించారు. తాప్సీ పన్ను నిజంగా మంచి పీఆర్ శిక్షణ అవసరమని అనన్య ద్వివేది సోషల్ మీడియాలో రాసుకొచ్చింది