Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Dharam Tej Accident: చికిత్సకు స్పందించి స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. వీడియో..

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. గత రాత్రి మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన

Sai Dharam Tej Accident: చికిత్సకు స్పందించి స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. వీడియో..
Sai Dharam Tej
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Sep 11, 2021 | 5:52 PM

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. గత రాత్రి మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి పడిపోయాడు… దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు తేజ్‏ను సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి చేర్పించి అత్యవసర చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స్ అందిస్తున్నారు. అయితే మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స్ జరుగుతున్న సమయంలో సాయి ధరమ్ తేజ్ స్పృహలోకి వచ్చినట్లుగా అక్కడి వైద్యులు తెలిపారు. ఐసీయూలో చికిత్స అందుస్తునన్న సమయంలో సాయి ధరమ్ తేజ్.. చికిత్స్ స్పందించాడని వైద్యులు తెలిపారు. తాజాగా అందుకు సంబంధించిన విజువల్స్ వీడియోను మెడికవర్ ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు.

ఆ వీడియోలో డాక్టర్ సాయి ధరమ్ తేజ్‏ను కదిలించగా.. ఆ సమయంలో సాయి ధరమ్ తన చేతును కదిలిస్తున్నారు. ప్రస్తుతం తేజ్‏కు అపోలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇప్పటికీ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్.. సాయి ధరమ్ తేజ కుటుంబసభ్యులు ఆసుపత్రిలోనే ఉన్నారు. హెల్మెట్ ధరించడం వల్లే తలకు గాయాలు కాలేదని. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనకు ఫిట్స్ వచ్చినట్లు 108 సిబ్బంది తెలిపారని. షోల్డర్ బోన్ ఫ్యాక్చర్ అయ్యిందని.. బాడీలో చిన్న చిన్న ఇంజూరీస్ ఉన్నాయని మెడికోవర్ ఆసుపత్రి డాక్టర్ సతీష్ తెలిపారు

Also Read: Viral Video: డోర్ ఓపెన్ చేయగానే మహిళకు గట్టి షాక్.. కాటు వేసేందుకు ప్రయత్నించిన పాము.. వీడియో వైరల్.!

Soybean Ganesh Idol: గణపతి మండపంలో కొలువుదీరిన సోయాబీన్ గణేశుడు.. కేవలం రూ. 1000 లతో తయారీ.. ఎక్కడంటే..

Drone Medicine: దేశంలో తొలిసారి అకాశమార్గా మందులు సరఫరా.. డ్రోన్‌ల ద్వారా మెడిసిన్స్‌కు తెలంగాణ సర్కార్ శ్రీకారం

Shraddha Das: అందాలతో తన ఫాన్స్ ను మంత్రముగ్ధుల్ని చేస్తున్న శ్రద్ధ దాస్..