AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: డోర్ ఓపెన్ చేయగానే మహిళకు గట్టి షాక్.. కాటు వేసేందుకు ప్రయత్నించిన పాము.. వీడియో వైరల్.!

ఇటీవల సోషల్ మీడియాలో జంతువులు, పాములు, పక్షులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ వీడియోలను

Viral Video: డోర్ ఓపెన్ చేయగానే మహిళకు గట్టి షాక్.. కాటు వేసేందుకు ప్రయత్నించిన పాము.. వీడియో వైరల్.!
Viral Video
Rajitha Chanti
|

Updated on: Sep 11, 2021 | 5:15 PM

Share

ఇటీవల సోషల్ మీడియాలో జంతువులు, పాములు, పక్షులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ వీడియోలను చూస్తే భయంతో వణికిపోవాల్సిందే. మరికొన్ని వీడియోలు మాత్రం పొట్ట చెక్కలయ్యేంతగా నవ్విస్తాయి. కానీ ఓ వీడియో మాత్రం నెటిజన్లు ఒకింత షాక్‏కు గురిచేసింది. ఆశ్చర్యంతోపాటు.. భయం కూడా కలిగిస్తుందండోయ్. పాములు అంటే చాలా మందికి భయం. పాము కనిపిస్తే చాలు.. భయంతో పరుగులు పెడతారు. పాము కనిపించిన చోట మళ్లీ వెళ్లడానికి భయంతో వణికిపోతారు. ఇక ఒంటరిగా వెళ్తుంటే పాము ఎదురైతే అంతే సంగతులు. చేసే హడావిడికి అదే పాపు మన కళ్ల కింద పడిపోయిన ఆశ్చర్యం లేదు. అంతగా గంతులేస్తారు పాముూును చూస్తే.. అయితే ఇప్పుడు పాముకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‏చల్ చేస్తోంది.

అమెరికాలోని టెక్సాస్‏లో నివసించే ఓ మహిళ తన ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా.. ఆకస్మాత్తుగా వరండాలో పాము ఆమెకు ఎదురైంది. పక్కనే ఉన్న పూల కుండి నుంచి బయటకు వచ్చిన పాము.. ఆమె కాలిపై కాటు వేయబోయింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన మహిళ గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి ఇంట్లోకి పరిగెత్తింది. ఆమె అరుపులకు పాపం పాము కూడా కంగారు పడినట్టుంది. వెంటనే ఆ పాము కూడా భయంతో పారిపోయింది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు విభిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో..

Also Read: Shraddha Das: అందాలతో తన ఫాన్స్ ను మంత్రముగ్ధుల్ని చేస్తున్న శ్రద్ధ దాస్..

Manike Mage Hithe Song: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మాణికే మాగే హితే సాంగ్.. అర్థంకాకపోయిన రికార్డ్స్ సృష్టిస్తోందిగా..

Viral Video: చిరుతను క్షణాల్లో వెంటాడి.. వేటాడిన సింహం.. గగుర్పొడిచే వీడియో వైరల్.!

Drone Medicine: దేశంలో తొలిసారి అకాశమార్గా మందులు సరఫరా.. డ్రోన్‌ల ద్వారా మెడిసిన్స్‌కు తెలంగాణ సర్కార్ శ్రీకారం