Manike Mage Hithe Song: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మాణికే మాగే హితే సాంగ్.. అర్థంకాకపోయిన రికార్డ్స్ సృష్టిస్తోందిగా..

అర్థంతో.. భాషతో సంబంధం లేదు.. మ్యూజిక్ నచ్చితే చాలు.. పదే పదే వినాలపిస్తోంది. ప్రస్తుతం మాణికే మాగే హితే సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Manike Mage Hithe Song: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మాణికే మాగే హితే సాంగ్.. అర్థంకాకపోయిన రికార్డ్స్ సృష్టిస్తోందిగా..
Manike Mage Hithe
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 11, 2021 | 4:40 PM

అర్థంతో.. భాషతో సంబంధం లేదు.. మ్యూజిక్ నచ్చితే చాలు.. పదే పదే వినాలపిస్తోంది. ప్రస్తుతం మాణికే మాగే హితే సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భాషతో సంబంధం లేకపోయినా.. భావం అర్థం కాకపోయినా.. చిన్నా, పెద్దా తేడా లేకుండా.. అందరిని అట్రాక్ట్ చేస్తోంది. ఇన్‏స్టా.. యూట్యూబ్ ఓపెన్ చేసిన ఈ సాంగ్ ఉండాల్సిందే. అలాగే ఎక్కడ చూసిన ఈ పాట వినిపిస్తోంది. అర్థం తెలియకపోయిన.. ఇన్‏స్టాలో రీల్స్ చేసేస్తున్నారు. కేవలం పాటకు మాత్రమే కాదండోయ్.. ఆలపించిన గాయనికి కూడా ఫిదా అవుతున్నారు. మన తెలుగు వారికి భాషతో పనిలేదు.. మ్యూజిక్ నచ్చితే చాలు పట్టం కట్టేస్తారు. అలాగే మాణికే మాగే హితే సాంగ్ లిరిక్స్, ట్యూన్‏కు యువత ఫిదా అయ్యారు. మీరు కూడా ఈపాటకు ఫిదా అయ్యే ఉంటారు కదా. తాజాగా ఈసాంగ్ నెట్టింట్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

ఇటీవల సోషల్ మీడియాలో రెండు పాటలు తెగ హల్‏చల్ చేస్తున్నాయి. ఒకటి బుల్లెట్టు బండి సాంగ్.. మరొకటి మాణికే మాగే హితే సాంగ్. బుల్లెట్టు బండి మన తెలుగు భాషలోని జానపద సాంగ్ కాగా.. మాణికే మాగే హితే పాట సింహళి భాషలోనిది. అంటే ఆ పాట శ్రీలంకకు చెందిన పాట. తాజాగా ఈ సాంగ్ నెట్టింట్లో నయా రికార్డ్ సృష్టించింది. ఈ పాట ఇప్పటివరకు దాదాపు 100 మిలియన్స్ వ్యూస్ పొందింది. ఈ సాంగ్ ఇంత హిట్ కావడానికి ప్రధాన కారణం.. ఆ పాట పాడిన సింగర్. ఆమె గొంతులోని మాధుర్యం శ్రోతలను ఆకట్టుకుంటుంది. అలాగే ఆ పాటకు తగ్గట్టుగా ఆమె ఎక్స్‏ప్రెషన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ పాట పలు భారతీయ భాషల్లోకి తర్జుమా అయ్యి.. యూత్‏ను తెగ అట్రాక్ట్ చేస్తోంది.

ఈ పాటలను అలపించింది శ్రీలంకలోని కొలంబోకు చెందిన ప్రముఖ పాప్ సింగర్ యొహాని డిసెల్వా. ఆమె కేవలం సింగర్ మాత్రమే కాదు.. పాటల రచయిత, నిర్మాత, బిజినెస్ ఉమెన్ కూడా. ఈమె తండ్రి మాజీ ఆర్మి అధికారి. తల్లి ఎయిర్ హోస్టస్. ఈకారణంతోనే యొహాని చిన్నతనంలోనే బంగ్లాదేశ్, మలేషియా వంటి ప్రాంతాల్లో పర్యటించారు. తన తల్లి ప్రోత్సాహంతో యొహాని చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుంది… యూట్యూబర్‏గా కెరీర్ ప్రారంభించిన యొహాని దేవియంగే బారే అనే పాటతో గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్‏లో ఎన్నో సాంగ్స్ ఆలపించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఈమెకు రాప్ ప్రిన్సెన్స్ అనే బిరుదు సైతం వరించింది. ఇక యొహాని 2021మేలో మాణిగే మాగే హితే సాంగ్ పాడి సోషల్ మీడియాను షేక్ చేశారు ఇప్పటివరకు ఈ పాటను 100 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసింది.

సాంగ్..

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్‏లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న అందాల యాంకరమ్మ.. ఇక అసలైన రచ్చ అప్పుడే..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ