ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ చరిత్ర సృష్టించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా 100 శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొందింది. 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‍సభ సీట్లలో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. ఇక పిఠాపురం నుంచి జనసేన అధిపతి పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి అయిన వంగా గీతపై ఏకంగా 70 వేల మెజారిటీతో విజయం సాధించారు పవన్. దీంతో పవన్ కు శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పవన్ విజయంతో మెగా ఫ్యామిలీ పండగ చేసుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబు, అల్లు అర్జున్ లు జనసేన అధిపతికి విషెస్ తెలిపారు. ఇక పవన్ కల్యాణ్ కు ఎంతో ఇష్టమైన మేనల్లుడు హీరో సాయి దుర్గ తేజ్ అయితే పట్టరాని సంతోషంలో మునిగి తేలుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే తన మామ పవన్ కల్యాణ్ ను కలిశాడు సాయి దుర్గ తేజ్. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‍ను ఆనందంతో సాయి ధరమ్ తేజ్ హత్తుకున్నారు. సంతోషంతో నవ్వుతూ భావోద్వేగానికి లోనయ్యాడు.
ఇక పవన్ కల్యాణ్ కూడా మేన మామను చూసి హ్యాపీగా ఫీలయ్యారు. గట్టిగా నవ్వేశారు. ఇంతలోనే పవన్ కల్యాణ్ ను అమాంతం ఎత్తుకున్నాడు తేజ్. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశాడు సాయి దుర్గ తేజ్. ‘ మీ గెలుపే మా పొగరు.. మా జనసేనాని పవన్ కల్యాణ్ గారు నా హీరో, నా గురు, నా హృదయం, అన్నింటికన్నా ముఖ్యం నా సేనాని’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చారు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. మామా అల్లుళ్ల సంబరం మాములుగా లేదంటూ మెగాభిమానులు కామెంట్లు కురిపిస్తున్నారు.
అంతకు ముందే పవన్ గెలుపుపై ట్వీట్ చేశాడు సాయి దుర్గ తేజ్. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం, భవిష్యత్తు సురక్షితమైన చేతుల్లో ఉందని పోస్ట్ చేశారు. అలాగే ‘చెప్పాడు.. చేశాడు.. మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.
మీ గెలుపే మా పొగరు.. మా జనసేనాని ❤️🔥😍 @pawankalyan garu my hero,my guru,my heart, most importantly MY SENANI 💪🏼💪🏼💪🏼 pic.twitter.com/qD2oXYtONH
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 4, 2024
చెప్పాడు… చేసాడు.
మనల్ని ఎవడ్రా ఆపేది!!!
💪🏼💪🏼💪🏼 pic.twitter.com/UN57aR0hD4— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 4, 2024
The Present & Future of Andhra Pradesh is now in safe hands.
POWER STORM @JanaSenaParty 💪🏼💪🏼💪🏼 pic.twitter.com/zM3QPlt7WZ
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.