RRR: మరో ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఆర్‌ఆర్‌ఆర్ నామినేట్.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు రేసులో జక్కన్న సినిమా
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా మరో ఘనత దక్కించుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్-2023కి జక్కన్న సినిమా నామినేట్ అయ్యింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడు విభాగాల్లో ఈ చిత్రం నామినేట్ అయింది.
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ ఏడాది మార్చి 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లతో పాటు ఎన్నో పురస్కారాలు, అవార్డులు సొంతం చేసుకుంది. ఇందులోని పాటలు, యాక్షన్ సీక్వెన్స్‌కు హాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా మరో ఘనత దక్కించుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్-2023కి జక్కన్న సినిమా నామినేట్ అయ్యింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడు విభాగాల్లో ఈ చిత్రం నామినేట్ అయింది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీల్లో ట్రిపుల్ ఆర్ నామినేట్ అయినట్లు ఆర్‌ఆర్‌ఆర్ చిత్రబృందం తెలిపింది. నామినేట్ అయిన గోల్డెన్ గ్లోబ్ రెండు కేటగిరీల్లో ఓ అవార్డు సంపాదించుకున్నా చాలు.. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డ్ దక్కించుకున్న తొలి సినిమాగా ఆర్‌ఆర్‌ఆర్ నిలుస్తుంది. కాగా ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా షేర్‌చేశారు రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రెండు విభాగాల్లో నామినేట్ చేసినందుకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ జ్యూరీకి ధన్యవాదాలు. టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు. అలాగే సినిమాను ఆదరించిన అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.
కాగా ఆర్‌ఆర్‌ఆర్ ఎమ్ ఎమ్ కీరవాణి లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ తరఫున ఉత్తమ సంగీత దర్శకుని అవార్డును అందుకున్నారు. ఆదివారం రాత్రి జరిగిన అవార్డు వేడుక తర్వాత LAFCA తన అధికారిక వెబ్‌సైట్‌లో అవార్డు విజేతల జాబితాను విడుదల చేసింది. కీరవాణి ఉత్తమ సంగీత దర్శకునిగా ప్రతిష్టాత్మకమైన LAFCA అవార్డును గెలుచుకున్నట్లు చిత్ర అధికారిక ట్విట్టర్ పేజీ తెలిపింది. ఇక బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ లో కూడా కీరవాణి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విన్నర్‌గా అవార్డును గెలుచుకున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..