RRR Movie : రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ అంటున్న జక్కన్న ట్రీమ్.. మెగా- నందమూరి అభిమానులకు పండగే
రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకోసం అటు మెగా అభిమానులు ఇటు నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
RRR Movie : రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకోసం అటు మెగా అభిమానులు ఇటు నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోస్ ను కలిసి సినిమా చేయడం అందులోనూ రాజమౌళి లాంటి ఓ డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ సినిమా షూటింగ్ నుంచి ఏ చిన్న విషయం లీకైన.. అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు రికార్డులను తిరగ రాస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూనిట్ పాటల చిత్రీకరణలో బిజీగా ఉంది. ఇప్పటికే టాకీ పూర్తయిన నేపథ్యంలో సాంగ్ షూట్ పూర్తి చేసిన తర్వాత ప్యాచ్ వర్క్ కి వెళ్లడానికి సన్నాహాకాలు చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి మరో అదిరిపోయే అనౌన్స్ మెంట్ చేసింది చిత్రయూనిట్. రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరిట ఈ సినిమా మేకింగ్ వీడియోను ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు ఆ సినిమా యూనిట్ ప్రకటించింది.
సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తోన్న విషయం తెలిసిందే. చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు వీరులను కలిపి సినిమా తెరకెక్కిస్తున్నారు జక్కన్న. ఈ సినిమా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నారు. ఇక ఈ నెల 15న రానున్న ఈ మేకింగ్ వీడియో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :