RK Roja: అమ్మ బాటలోనే.. రోజా కూతురిని వరించిన మరో ప్రతిష్ఠాత్మక అవార్డు.. ఫొటోస్ వైరల్
నటి, మాజీ మంత్రి రోజా కూతురుగానే కాకుండా ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అన్షు మాలిక. ఓ వైపు ఉన్నత చదువులు కొనసాగిస్తూనే రైటర్ గా ట్యాలెంట్ చూపిస్తోందీ స్టార్ కిడ్. ఇప్పటికే పలు పుస్తకాలు రాసిన అన్షు అప్పుడప్పుడు ఫ్యాషన్ పోటీల్లోనూ మెరుస్తోంది.

ప్రముఖ సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా గారాల పట్టి అన్షు మాలిక చిన్నప్పటి నుంచే మల్టీ ట్యాలెంటెడ్. ఇప్పటికే రచయిత్రిగా పలు పుస్తకాలు రాసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ స్టార్ కిడ్. అలాగే ఫ్యాషన్ పోటీల్లోనూ సందడి చేస్తోంది. సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసిస్తోన్న అన్షు ప్రతిభకు ప్రతీకగా మరో అవార్డు వరించింది. అమెరికా బ్లూమింగ్‌టన్‌లోని ఇండియానా వర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్స్ చదువుతుంది రోజా కూతురు. తాజాగా అన్షుకు ప్రతిష్టాత్మకమైన మౌరీన్ బిగ్గర్స్ అవార్డు 2025–26 వరించింది. ఇండియానా వర్సిటీ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ ఉమెన్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మౌరిన్ బిగ్గర్స్ టెక్నాలజీలో ఈక్విటీని ప్రోత్సహిస్తున్న వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. అలా ఈ సంవత్సరం రోజా కూతురు ఈ పురస్కారానికి ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన వర్గాల వారి స్థితిగతులపై అధ్యయనం చేయడం, సాంకేతిక విద్యను పెంపొందించే కార్యక్రమాలకు నాయకత్వం వహించడం, మహిళలకు వెబ్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడం, సోషల్ మీడియా ద్వారా పేదవర్గాలకు సాంకేతిక విద్యను అందించడం.. ఇలాంటి అంశాలపై పరిశోధన, వాటి కోసం పనిచేసిన అంశాల్లో అన్షుకి ఈ అవార్డును ప్రకటించినట్లు యూని వర్సిటీ వర్గాలు తెలిపాయి.
కాగా తనకు అవార్డు వచ్చిన విషయాన్నిసోషల్ మీడియాలో పంచుకుంది అన్షు. అంతేకాదు లోకల్ మీడియాలో తన గురించి ప్రచురితకమైన ఓ వార్త కథనాన్ని కూడా అందులో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పలువురు నెటిజన్లు రోజా కూతురికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అన్షు మలికా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
రాజకీయాలతో బిజీగా ఉన్న రోజా ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై మెరుస్తోంది. డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి జడ్జీగా వ్యవహరిస్తోంది. అలాగే పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ మెరుస్తోంది.
ట్రెడిషినల్ లుక్ లో రోజా కూతురు అన్షు..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




