AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha: త్రిష నటించిన ఆ ఒక్క తెలుగు సినిమా 9 భాషల్లో రీమేక్.. కట్ చేస్తే అన్నీ సూపర్ హిట్

మనం రోజూ ఎన్నో సినిమాలు చూస్తుంటాం, కానీ కొన్ని సినిమాలు మాత్రం మన మనసులో ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' అలాంటి ఒక అద్భుతమైన సినిమా. త్రిష, సిద్ధార్థ్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరించిందో మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా ఏకంగా తొమ్మిది భాషల్లో రీమేక్ అయి రికార్డు సృష్టించింది.

Phani CH
|

Updated on: May 08, 2026 | 7:01 PM

Share
మన ఇంట్లో ఎవరైనా పెళ్లి సందడి గురించి మాట్లాడుతుంటే.. వెంటనే గుర్తొచ్చే సినిమాల్లో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' ఒకటి. అసలు ఆ ఊరు, ఆ పొలం, సిరి-సంతోష్ ల ప్రేమ.. అబ్బో ఆ మ్యాజిక్కే వేరు కదా! ఈ సినిమా విడుదలై ఇన్నేళ్లవుతున్నా, టీవీలో వస్తే ఇప్పటికీ రిమోట్ పక్కన పెట్టేసి మరీ చూస్తాం.

1 / 5
కానీ మీకు తెలుసా? ఈ సినిమా కేవలం మనకే కాదు, దేశవ్యాప్తంగా చాలా మందికి ఫేవరెట్. అందుకే ఈ సినిమాను ఒకటో రెండో కాదు, ఏకంగా తొమ్మిది సార్లు వివిధ భాషల్లో రీమేక్ చేశారు. భారతీయ సినీ చరిత్రలో ఇన్నిసార్లు రీమేక్ అయిన సినిమా మరొకటి లేదంటే నమ్ముతారా?

2 / 5
ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. త్రిష నటన, సిద్ధార్థ్ ఎనర్జీ, శ్రీహరి గారి ఎమోషన్.. ఈ మూడు కలిపి సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. ఈ సినిమా సక్సెస్‌ను చూసి తమిళం (ఉనక్కుమ్ ఎనక్కుమ్), కన్నడ (నీనెల్లో నానల్లే), బెంగాలీ, ఒడియా, పంజాబీ, మణిపురి, నేపాలీ, బంగ్లాదేశ్ బెంగాలీ భాషల్లో రీమేక్ చేశారు.

3 / 5
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ ఎనిమిది భాషల్లోనూ ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కానీ, 2013లో హిందీలో 'రామయ్యా వస్తావయ్యా' పేరుతో గిరీష్ కుమార్, శృతి హాసన్ జంటగా ప్రభుదేవానే స్వయంగా దర్శకత్వం వహించిన రీమేక్ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. మిగిలిన అన్ని భాషల్లో త్రిష పండించిన ఆ అమాయకత్వం, ఆ ఎమోషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.

4 / 5
ముఖ్యంగా తమిళ వెర్షన్‌లో కూడా త్రిషనే హీరోయిన్‌గా నటించి అక్కడ కూడా హిట్ అందుకుంది. ఒక మంచి కథకు భాషతో సంబంధం లేదని, అది ఎక్కడికైనా వెళ్తుందని ఈ సినిమా నిరూపించింది. ఇప్పటికీ ఈ సినిమా చూస్తుంటే మన సొంత ఇంట్లో కథలాగే అనిపిస్తుంది, అదే ఈ మూవీ అసలైన సక్సెస్!

5 / 5
Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?