ఇద్దరు పిల్లల తల్లైనా తరగని అందం.. ఈ ముద్దుగుమ్మ బ్యూటీ సీక్రేట్ ఇదే!

samatha

08 may 2026

టాలీవుడ్ నటి ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

ప్రణీత సుభాష్

ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఏం పిల్లో ఏం పిల్లోడో మూవీ

ముఖ్యంగా ఈ మూవీ తర్వాత సిద్ధార్థ్ హీరోగా వచ్చిన బావ మూవీలో నటించి, ఈ మూవీలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

బావ మూవీ

దీని తర్వాత అత్తారింటికి దారేది మూవీలో సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించింది. అంతే కాకుండా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

అత్తారింటికి దారేది

ఇక కెరీర్ పీక్స్ స్టేజ్‌లో ఉండగానే ఈ బ్యూటీ వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. అంతే కాకుండా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.

వివాహం

ఇద్దరు పిల్లలకు తల్లైనా ఈ బ్యూటీ ఇప్పటికీ యంగ్‌గా కనిపిస్తూ తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది.

ఇద్దరు పిల్లలకు జననం

ఈ బ్యూటీ ఎక్కువగా ఇంటి ఆహారాన్నే ఇష్టపడతుందంట. అలాగే, ఎక్కువగా పోషకాలు ఉన్న, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటుంది.

బ్యూటీ సీక్రెట్

అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ తన డైట్‌లో తప్పకుండా బాదం ఉండేలా చూసుకుంటుందంట. ఇది చర్మం, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

బాదం

అదే విధంగా మంచి ఆహారంతో పాటు, నిత్యం వ్యాయామం చేయడం ద్వారా తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటానని తెలియజేసింది.

వ్యాయామం