KCR Movie: కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత.. కష్టానికి దక్కిన ఫలితం అంటున్న నెటిజన్స్

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయినా రాకేష్.. రీసెంట్ గా కేసీఆర్ ( కేశవా చంద్ర రామావత్) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

KCR Movie: కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత.. కష్టానికి దక్కిన ఫలితం అంటున్న నెటిజన్స్
Kcr Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 24, 2024 | 8:45 AM

జబర్దస్త్ ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. వారిలో రాకింగ్ రాకేష్ ఒకడు. తన కామెడీతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు రాకేష్. చిన్న చిన్న స్టేజ్ షోల దగ్గర నుంచి ఇప్పుడు ఓ సినిమాకు నిర్మాతగా నటుడిగా మారి ఎంతో మందికి స్పూర్తి‌గా నిలిచాడు. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయినా రాకేష్.. రీసెంట్ గా కేసీఆర్ ( కేశవా చంద్ర రామావత్) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆకట్టుకునే కథనం, ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిన కేసీఆర్ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. నటుడిగా రాకేష్ ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే నిర్మాతగానూ తన సినిమాను కాపాడుకున్నాడు. సినిమాలో ప్రతి సన్నివేశానికి ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు.

ఇది కూడా చదవండి : బాబోయ్ బొమ్మరిల్లు నటి ఇలా మారిపోయిందేంటీ..! అస్సలు గుర్తుపట్టలేరు గురూ..!!

తెలంగాణ నేటివిటీ ఉట్టిపడేలా కేసీఆర్ సినిమాను తెరపైకి తీసుకు వచ్చాడు రాకేష్. సినిమా చూస్తున్నంత సేపు రాకేష్ అతని టీమ్ పడిన కష్టం మనకు కనిపిస్తుంది. మన ఇంట్లో పిల్లోడు లేదా మన ఊరిలో ఉండే ఓ కుర్రోడి కథలా అనిపిస్తుంది. ఇక ఈ సినిమా విజయవంతంగా నడుస్తుంది. థియేటర్స్ లో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రాకేష్ పై అలాగే చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా తన సినిమా చూస్తూ ఎమోషనల్ అయ్యాడు రాకేష్. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి : ఆమె నవ్వే ఓ నాటు గులాబీ.. కంగనా వెనకున్న అమ్మాయి ఎవరో కనిపెట్టరా.?

తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో రాకింగ్ రాకేష్ తన భార్య సుజాత అలాగే పాప తో కలిసి కేసీఆర్ సినిమా చూశారు. సినిమా చూస్తూ రాకేష్, సుజాత ఎమోషనల్ అయ్యారు. తమ కష్టానికి దక్కిన ఫలితాన్ని చూసి ఈ భార్యాభర్త భావొద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా బాగుందని రాకేష్ కు కంగ్రాట్స్ చెప్తున్నారు.” మన కళ్ళ ముందు చాలా సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి. ఒక్కసారి ఈ సినిమాను కూడా చూడండి. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన సినిమా ఇది” అని ఒకరు ” “నీ కష్టానికి దక్కిన ఫలితం అన్న” అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : RGV : ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! ఆర్జీవీ నెంబర్ బ్లాక్ చేసిన హాట్ యాంకర్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..