బాబోయ్ బొమ్మరిల్లు నటి ఇలా మారిపోయిందేంటీ..! అస్సలు గుర్తుపట్టలేరు గురూ..!!

ఇప్పటికీ ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టాదు. ఆకట్టుకునే ప్రేమ కథ.. అలాగే గుండెను హత్తుకునే ఎమోషనల్ సీన్స్  ప్రేక్షకులను కట్టిపడేశాయి. సిద్ధార్థ్, జెనీలియా జంటగా నటించిన బొమ్మరిల్లు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

బాబోయ్ బొమ్మరిల్లు నటి ఇలా మారిపోయిందేంటీ..! అస్సలు గుర్తుపట్టలేరు గురూ..!!
Bommarillu
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 23, 2024 | 12:01 PM

టాలీవుడ్ లో చాలా సినిమాలు కల్ట్ క్లాసిక్స్ గా నిలిచాయి . అలాంటి సినిమాల్లో బొమ్మరిల్లు మూవీ ఒకటి. భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టాదు. ఆకట్టుకునే ప్రేమ కథ.. అలాగే గుండెను హత్తుకునే ఎమోషనల్ సీన్స్  ప్రేక్షకులను కట్టిపడేశాయి. సిద్ధార్థ్, జెనీలియా జంటగా నటించిన బొమ్మరిల్లు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2006లో వచ్చిన ఈ మూవీలో చాలా మంది నటించారు. ప్రకాష్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం ఇలా చాలా మంది నటించారు. అలాగే ఇదే సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ గుర్తుందా.?

12 సినిమాలు చేస్తే రెండే హిట్ అయ్యాయి.. కానీ అందంలో అప్సరసే..

బొమ్మరిల్లు సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించింది. ఓ బ్లాక్ బస్టర్ మూవీలో హీరోయిన్ గా చేసింది. ఆతర్వాత ఆమెకు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో సెకండ్ హీరోయిన్ గా చేసింది. అయినా కూడా అంతగా క్లిక్ అవ్వలేదు. దాంతో ఇండస్ట్రీకి దూరం అయ్యింది. బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ్ ను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిగా కనిపించిన ఆమె పేరు నేహా బాంబ్. యంగ్ హీరో నితిన్ నటించిన దిల్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఆతర్వాత అతడే ఒక సైన్యం, దుబాయ్ శీను, బొమ్మరిల్లు సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించింది.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ప్రస్తుతం పాన్ ఇండియన్ ఊపేస్తున్న ఈ హీరోగారిని గుర్తుపట్టారా.?

నేహా బాంబ్ తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేసింది. ఆతర్వాత సినిమాలకు దూరం అయ్యింది రిషిరాజ్ ఝావేరి అనే వ్యక్తిని పెళ్లాడింది. ఇక ఇప్పుడు ఫ్యామిలీతో బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే నేహా బాంబ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో అమ్మడిని చూసి అందరూ షాక్ అవుతున్నారు.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి మాస్ రా మావ..! స్టార్ హీరోయిన్స్ ను బీట్ చేసేలా మహేష్ అన్న కూతురు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..