Deepika Padukone: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి హీరోయిన్ దీపికా అనుకుంటున్నారు కదూ ?.. అయితే పప్పులో కాలేసినట్లే..

అచ్చం సౌందర్య మాదిరిగానే పెద్ద పెద్ద కళ్లు.. చంద్రబింబం వంటి ముఖంతో ఆ అమ్మాయి సౌందర్యను గుర్తుచేసింది. తాజాగా మరో అమ్మాయి ఏకంగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెలా కనిపిస్తుంది.

Deepika Padukone: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి హీరోయిన్ దీపికా అనుకుంటున్నారు కదూ ?.. అయితే పప్పులో కాలేసినట్లే..
Deepika
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 14, 2022 | 2:08 PM

సాధారణంగా ఈ ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. అందులో కవలలు కాకుండా.. మరికొందరు కూడా ఎక్కడో ఒకచోట ఉండే ఉంటారు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో టిక్ టాక్, ఇన్ స్టా రీల్స్ వచ్చిన తర్వాత అచ్చం తెలిసిన మనుషుల మాదిరిగానే ఉండేవారు కనిపిస్తుంటారు. అలా సెలబ్రెటీలను పోలీన వారిని కూడా చూశాం. ఇప్పటికే అచ్చం సౌందర్య మాదిరిగా ఉన్న ఓ అమ్మాయికి సంబంధించిన ఇన్ స్టా రీల్స్ , వీడియోస్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. అచ్చం సౌందర్య మాదిరిగానే పెద్ద పెద్ద కళ్లు.. చంద్రబింబం వంటి ముఖంతో ఆ అమ్మాయి సౌందర్యను గుర్తుచేసింది. తాజాగా మరో అమ్మాయి ఏకంగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెలా కనిపిస్తుంది. దీంతో జూనియర్ దీపికా అంటూ నెట్టింట కామెంట్స్‏తో హోరెత్తిస్తున్నారు నెటిజన్స్. ఇంతకీ ఎవరా అమ్మాయి ? అనేది తెలుసుకుందామా.

ఆ అమ్మాయి పేరు రిజుతా ఘోష్. కోల్ కత్తాకు చెందిన ఈ ఆమె అచ్చం దీపికా పదుకొణెలాగే ఫేస్ కట్ ఉంది. ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పుడు ఫోటోస్, రీల్స్ తో నెట్టింట రచ్చ చేస్తుంది. రిజుతా.. డిజిటల్ క్రియేటర్.. ఆమె 2015లో ఇన్ స్టాలో అడుగుపెట్టింది. మొదట్లో ఆమె ఎక్కువగా వృత్తిపరమైన విశేషాలను పంచుకుంది. ఆ తర్వాత తన స్టిల్స్ షేర్ చేయడం ప్రారంభించింది. అయితే అందులో అచ్చం దీపికాను తలపించేలాగే రిజుతా కనిపించడంతో నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరిగిపోయింది. రిజుతా చేసిన రీల్స్, షేర్ చేసిన ఫోటోలలో ఆమె అచ్చం దీపికా మాదిరిగా ఉండడంతో నెటిజన్స్ థ్రిల్ అవుతున్నారు. మీరు దీపికల ఉన్నారు. దీపికా పదుకొణె చెల్లెలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రిజుతా ఇన్ స్టా ఫాలోవర్ల సంఖ్య సుమారు 49,000.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.