AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Retro Movie Review: రెట్రో సినిమా రివ్యూ.. సూర్య, పూజా హెగ్డే సక్సెస్ ట్రాక్ ఎక్కారా?

సూర్య హీరోగా కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన సినిమా రెట్రో. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం వేచి చూస్తున్న సూర్య, కార్తిక్ కలిసి చేసిన ప్రయత్నం ఇది. మరి ఈ ప్రయత్నం ఫలించిందా..? సూర్య కోరుకున్న సక్సెస్ రెట్రో తీసుకొచ్చిందా..? అసలు ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Retro Movie Review: రెట్రో సినిమా రివ్యూ.. సూర్య, పూజా హెగ్డే సక్సెస్ ట్రాక్ ఎక్కారా?
Retro Movie
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: May 01, 2025 | 4:11 PM

Share

మూవీ రివ్యూ: రెట్రో

నటీనటులు: సూర్య, పూజా హెగ్డే, జోజు జార్జ్, ప్రకాష్ రాజ్, నాజర్, జయరాం తదితరులు

సంగీతం: సంతోష్ నారాయణన్

సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ

ఎడిటింగ్: షఫీక్ మొహమ్మద్ అలీ

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కార్తీక్ సుబ్బరాజ్

నిర్మాతలు: సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం

కథ:

1993.. తన చిన్నతనంలోనే పారివేల్ కణ్ణన్ (సూర్య) తన తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు. అప్పుడే గ్యాంగ్‌స్టర్ తిలక్ రాజ్ (జోజు జార్జ్) అతన్ని పెంచుకుంటాడు. చిన్నప్పటి నుంచి కూడా పారి అంటే తిలక్‌కు నచ్చదు.. అయినా కూడా భార్య కోసమే భరిస్తుంటాడు. చిన్నప్పటి నుంచి తను అనుభవించిన పరిస్థితుల కారణంగా పారికి అస్సలు చిన్నతనం నుంచి నవ్వు అంటేనే తెలియదు. పారి కూడా గ్యాంగ్ స్టర్‌గా మారతాడు. ఆ సమయంలోనే రుక్మిణి (పూజా హెగ్డే) పారి జీవితంలోకి వస్తుంది. వాళ్ల పరిచయం ప్రేమగా మారుతుంది. కానీ సరిగ్గా అదే సమయంలో పారి జీవితంలోకి అనుకోని సంఘటనలు జరిగి జైలుకు వెళ్తాడు. అక్కడ్నుంచి తప్పించుకుని తన ప్రేయసి రుక్మిణి అండమాన్‌లోని ఒక దీవిలో ఉందని తెలిసి అక్కడికి వెళ్తాడు. అక్కడ దొరలు రాజ్ వేల్, తన కొడుకు మైఖేల్ (వేదు)లు చేసే అరాచకాలు ఏంటి..? పారి అక్కడెందుకు ఉంటాడు.. వాళ్ల చేతుల్లో ఎలా చిక్కుకుంటాడు.. ఆ తర్వాత ఏం చేసాడు అనేది అసలు కథ..

కథనం:

కొన్ని సినిమాలు దర్శకుడి బ్రాండ్ చూసి ఒప్పుకుంటూ ఉంటారు హీరోలు. సూర్య రెట్రో సినిమా కూడా అలా ఓకే చేసిందేమో అనిపిస్తుంది చూసాక. అసలు కథ ఎక్కడ మొదలైంది.. ఎటు పోతుంది.. ఎక్కడికి వెళ్లి ఆగుతుంది.. ఇలా ఒక్కటి కూడా అర్థం కాకుండా తీసాడు కార్తిక్ సుబ్బరాజ్. ఏం చెప్పాలనుకుంటున్నాడో కూడా అర్థమవ్వదు. అయితే మేకింగ్ విషయంలో మాత్రం కార్తిక్ సుబ్బరాజ్ న్యూ స్టైల్ ఫాలో అయ్యాడు. కథ బాగుంటే అది మేకింగ్ హెల్ప్ అవుతుంది కానీ మ్యాటర్ లేకపోతే ఎన్ని మేకప్స్ వేసినా లాభం లేదు. మాఫియా అంటాడు.. గ్యాంగ్ అంటాడు.. నవ్వు రావట్లేదంటాడు.. కోపం వస్తుందంటాడు.. వాటన్నింటికీ ప్రాపర్ రిజనింగ్ కూడా ఉండదు. సింగిల్ సిట్టింగ్‌లో తేల్చే సమస్యను సినిమా అంతా లాగుతూనే ఉన్నాడు కార్తిక్ సుబ్బరాజ్.. బహుశా కార్తిక్ సుబ్బరాజ్ ట్రాక్ రికార్డ్ చూసి రెట్రో ఒప్పుకుని ఉంటాడు సూర్య. కానీ అది వర్కవుట్ అవ్వలేదు. ఫస్టాఫ్ అంతా సాఫీగా వెళ్లిపోతుంది. ముఖ్యంగా ఛాప్టర్స్ వైజ్‌గా ఈ కథను చెప్పాడు దర్శకుడు కార్తిక్. లవ్, లాఫ్టర్, వార్ అంటూ ముందుకు వెళ్లిపోయాడు. అందులో కేవలం లాఫ్టర్ మాత్రమే వర్కవుట్ అయింది. సూర్య, పూజా హెగ్డే మధ్య వచ్చే సీన్స్ పెద్దగా ఆసక్తికరంగా అయితే అనిపించవు. అలాగే అండమాన్ సీన్స్ కూడా అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఓవరాల్‌గా చూసుకుంటే రెట్రో అంతగా కిక్ అయితే ఇవ్వదు. కథ ఒకలా మొదలై.. ఏటెటో వెళుతుంది. వీటితో ఆడియన్స్ కూడా ఎటెటో వెళ్లిపోతారు. ప్రీ క్లైమాక్స్ సూర్యపై ట్విస్ట్ వచ్చే వరకు కథనం అంతా చప్పగా సాగుతుంది.

నటీనటులు:

సూర్య మరోసారి అదరగొట్టాడు. ఆయనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా రప్ఫాడిస్తాడు. రెట్రోలోనూ అదే చేసాడు. పూజా హెగ్డే తన పాత్రలో పర్లేదు. మలయాళ నటుడు జోజు జార్జ్‌కు మంచి పాత్ర పడింది. మరో నటుడు జయరాంను బాగా వాడుకున్నారు. విలన్ విదు ఓకే.. నాజర్ కూడా పర్లేదు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం రెట్రో సినిమాకు బలం. చాలా సీన్స్ కేవలం ఈయన ఆర్ఆర్‌తోనే నిలబడ్డాయి. శ్రేయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ చాలా బెటర్‌గా ఉండాల్సింది. 2 గంటల 48 నిమిషాల నిడివి అస్సలు భరించలేం. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఎంచుకున్న లైన్ బాగుంది గానీ తీసిన విధానం అస్సలు ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా రెట్రో.. మరీ ఇలా అయితే కష్టమే సూర్య గారూ..!

అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.40 లక్షలు దోచుకున్నాక మళ్ళీ అదే బెదిరింపు.. కట్ చేస్తే..
రూ.40 లక్షలు దోచుకున్నాక మళ్ళీ అదే బెదిరింపు.. కట్ చేస్తే..
ఏంటీ.. ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో హీరోయినా.. ?
ఏంటీ.. ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో హీరోయినా.. ?