బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్‌తో టీవీ9 ఎండీ బరుణ్ దాస్ ఇంటర్వ్యూ.. లైవ్ వీడియో
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ -వేవ్స్ ముంబై వేదికగా ప్రారంభమైంది. ప్రపంచ మీడియా పవర్ హౌస్‌గా భారత దేశాన్ని సమున్నతంగా నిలిపేందుకు ప్రభుత్వం నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. కనెక్టింగ్ క్రియేటర్స్..
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ -వేవ్స్ ముంబై వేదికగా ప్రారంభమైంది. ప్రపంచ మీడియా పవర్ హౌస్‌గా భారత దేశాన్ని సమున్నతంగా నిలిపేందుకు ప్రభుత్వం నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. కనెక్టింగ్ క్రియేటర్స్.. కనెక్టింగ్ కంట్రీస్’ అన్న ట్యాగ్ లైన్‌తో ఈ వేవ్స్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు. 90కి పైగా దేశాల నుంచి పదివేల మందికి పైగా ప్రతినిధులు, 300కి పైగా కంపెనీలు, 350కి పైగా స్టార్ట్ అప్‌లు ఈ భారీ సదస్సులో పాలు పంచుకుంటున్నాయి. మూవీలు, ఓటీటీ, గేమింగ్, కామిక్స్, డిజిటల్ మీడియా, AI అన్నింటిని ఒకే వేదికపై అనుసంధానిస్తూ మీడియా-వినోద రంగంలో మన దేశ సత్తాను చాటడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. సినిమాలు, డిజిటల్ మీడియా, బ్రాడ్ కాస్టింగ్ విభిన్న రంగాలపై లోతుగా చర్చలు జరగనున్నాయి. భారతదేశం తొలిసారిగా గ్లోబల్ మీడియా డైలాగ్‌కి ఆతిథ్యం ఇస్తోంది. కాగా, ఈ కార్యక్రమంలో బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్‌ను కీలక ఇంటర్వ్యూ చేయనున్నారు టీవీ9 ఎండీ, సీఈఓ బరుణ్ దాస్. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన లైవ్ లింక్ ఇక్కడ చూడండి.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

