Pawan Kalyan: నాన్నకు ప్రేమతో.. పవన్ జర్నీపై అఖిరా నందన్ స్పెషల్ వీడియో.. చూస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే

రేణు దేశాయ్ కూడా పవన్ కు అభినందనలు తెలిపింది. 'పవన్‌ కల్యాణ్‌ విజయంతో ఆద్య, అకిరాలు చాలా సంతోషంగా ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ తీర్పు తో ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను' అంటూ మాజీ భర్త విజయాన్ని స్వాగతించింది. ఇక పవన్ జర్నీని పురస్కరించుకుని ఆయన కుమారుడు అఖిరా నందన్ ఒక స్పెషల్ వీడియో చేశాడు.

Pawan Kalyan: నాన్నకు ప్రేమతో.. పవన్ జర్నీపై అఖిరా నందన్ స్పెషల్ వీడియో.. చూస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే
Pawan Kalyan Family

Updated on: Jun 06, 2024 | 7:39 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన ప్రభంజనం సృష్టించింది. పవన్ తో సహా గాజు గ్లాసు మీద పోటీ చేసిన మొత్తం 21 మంది అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అలాగే 2 ఎంపీ సీట్లను కూడా జనసేన కైవసం చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా పవన్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, మహేశ్ బాబు, రవితేజ తదితరులు పవన్ కు విషెస్ తెలిపారు. రేణు దేశాయ్ కూడా పవన్ కు అభినందనలు తెలిపింది. ‘పవన్‌ కల్యాణ్‌ విజయంతో ఆద్య, అకిరాలు చాలా సంతోషంగా ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ తీర్పు తో ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను’ అంటూ మాజీ భర్త విజయాన్ని స్వాగతించింది. ఇక పవన్ జర్నీని పురస్కరించుకుని ఆయన కుమారుడు అఖిరా నందన్ ఒక స్పెషల్ వీడియో చేశాడు.
ఖుషి నుంచి భీమ్లా నాయక్‌ వరకు పవన్‌ కల్యాణ్ పవర్ ఫుల్‌ డైలాగ్స్‌, ఇంటెన్స్‌ సీన్స్‌ అన్నింటిని కలిపి ఈ వీడియోను ఎడిట్‌ చేసి రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అకిరా నందన్ ఎడిట్‌ చేసిన ఈ వీడియో అభిమానులకు గూస్‌బంప్స్‌ తెప్పిస్తోంది.

కాగా కొన్ని రోజుల క్రితం ‘అకిరా వాళ్ల నాన్న కోసం చేసిన వీడియో’ అంటూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది రేణూ దేశాయ్. తాజాగా ఈ వీడియోను షేర్ చేయమని అకీరా కోరినట్లు రేణు దేశాయ్‌ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

దీంతో ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన రేణూ దేశాయ్.. ‘కొద్దిసేపటి క్రితమే అకిరా నాకు ఫోన్‌ చేసి ‘ అమ్మా.. నాన్న మాంటేజ్‌ వీడియో షేర్‌ చేయమని చెప్పాడు. కాబట్టి ఇది అకిరా ఆనందం చేశాను. నా లిటిల్‌ బాయ్‌కి వాళ్ల నాన్నపై ఉన్న ప్రేమ, తన తండ్రి స్ఫూర్తిదాయక ప్రయాణంపై ఉన్న గర్వానికి ఈ వీడియో ప్రత్యక్ష నిదర్శనం’ అని ఈ వీడియోకు క్యాప్షణ్ ఇచ్చింది రేణూ దేశాయ్.

చంద్రబాబు పాదాలకు నమస్కారం చేసిన అకీరా నందన్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.