Pawan Kalyan: తండ్రి అడుగుజాడల్లోనే తనయ.. ఆద్య చేసిన మంచి పనిని చూసి మురిసిపోతున్న రేణూ దేశాయ్.. వీడియో
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాటలోనే వారి పిల్లలు కూడా పయనిస్తున్నారు. సింప్లిసిటీలోనూ, సేవా కార్యక్రమాల్లోనూ తండ్రికి తగ్గ పిల్లలు అనిపించుకుంటున్నారు. తాజాగా పవన్ కూతురు ఆద్య చేసిన ఒక మంచి పని అందరి మన్ననలు అందుకుంటోంది. ఇక తల్లి రేణూ దేశాయ్ అయితే తెగ మురిసిపోయింది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసిన ఆయన ఇప్పుడు కేవలం ప్రజాసేవకే పరిమితమయ్యారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ బాటలోనే వారి పిల్లలు పయనిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో తండ్రికి తగ్గ బిడ్డలు అనిపించుకుంటున్నారు. తాజాగా పవన్ కూతురు ఆద్య చేసిన ఒక మంచి పని అందరి మన్ననలు అందుకుంటోంది. ఇక రేణూ దేశాయ్ అయితే కూతురి గొప్ప తనాన్ని చూసి తెగ మురిసిపోయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అదేంటంటే.. తాజాగా ఆద్య తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. సాధారణంగా సెలబ్రిటీల పిల్లలంటే పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా ఉంటాయి. కేక్ కటింగ్, పార్టీలు, విందులు, వినోదాలు, ఫ్రెండ్స్.. ఇలా తమకు నచ్చిన రీతిలో పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఆద్య మాత్రం సింపుల్ గా తన పుట్టిన రోజును జరుపుకొంది. దీనికి సంబంధించి రేణూ దేశాయ్ కు ముందే చెప్పిందట. బర్త్ డే కదా అని హడావిడి, హంగామా ఏమీ వద్దని, చాలా సింపుల్‌గా బర్త్ డేను సెలెబ్రేట్ చేయమని రేణూను కోరిందట ఆద్య. వాటికి ఖర్చు పెట్టే డబ్బుల్ని ఎన్జీవోకి వాడమని చెప్పిందట. తద్వారా ఎన్నో మూగ జీవాలకు ఆ డబ్బులు ఉపయోగపడతాయని సలహా ఇచ్చిందట.
ఇక తన కూతురు అలా చెప్పడంతో తల్లిగా రేణూ దేశాయ్ ఎంతో మురిసిపోయింది. దీనికి సంబంధించి రేణూ దేశాయ్ షేర్ చేసిన వీడియో పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఆద్యను తెగ ప్రశంసిస్తున్నారు. సేవా గుణంలో తండ్రికి తగ్గ తనయ అని, ఆమె మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
రేణూ దేశాయ్ షేర్ చేసిన వీడియో..
View this post on Instagram
కాగా పవన్ కల్యాణ్ కుమారుడు అకిరా నందన్ త్వరలోనే సినిమాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పియానో, మ్యూజిక్ తదితర అంశాల్లో పట్టు సాధించిన పవన్ తనయుడు ఓజీ సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. అకీరా ఎంట్రీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.