Mega 154: మెగాస్టార్ సినిమాకి మాస్ రాజా రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ పెంచారు.వరుస సినిమాలను లైన్ లో పెట్టి దూసుకుపోతున్నారు చిరు. ప్రస్తుతం చిరంజీవి నాటించిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
Mega 154: మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ పెంచారు.వరుస సినిమాలను లైన్ లో పెట్టి దూసుకుపోతున్నారు చిరు. ప్రస్తుతం చిరంజీవి నాటించిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను రీమేక్ చేస్తున్నాడు చిరు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా పూజాకార్యక్రమాలతో ఇటీవలే మొదలైంది. ఈ సినిమాలో మెగాస్టార్ డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు.
ఇక ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ తో సినిమా చేస్తున్నాడు మెగాస్టార్. ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదాళం మూవీకి రీమేక్ గా వస్తుంది. ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు చిరు. మెగా 154 లో చిరంజీవి ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ రాజా రవితేజ కూడా నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో రవితేజ మెగాస్టార్ తో కలిసి సందడి చేస్తాడని తెలుస్తుంది. రవితేజ ఒక్కో సినిమాకి 10కోట్లు పారితోషికం అందుకుంటున్నాడట కానీ.. ఇప్పుడు అన్నయ్య చిరంజీవి సినిమాలో పాత్రను చేయడానికి 7 కోట్లు తీసుకోబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలిసియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :