ఛలో సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కన్నడ బ్యూటీ రష్మిక(Rashmika Mandanna). వెంకీ కుడుములు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతర్వాత పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీతగోవిందం సినిమాతో మరో హిట్ అందుకుంది ఈ చిన్నది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ భామ. ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ కన్నడ బ్యూటీ.. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస ప్రాజెక్టులతో క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తుంది. అలాగే కన్నడ ఇండస్ట్రీలో కూడా ఈ అమ్మడు సినిమాలు చేస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు తన అభిమాన హీరో గురించి చెప్పుకొచ్చింది. తన స్కూల్ డేస్ నుంచి దళపతి విజయ్ అంటే చాలా ఇష్టమట ఈ చిన్నదానికి. భారీ స్టార్డమ్ ఉన్నప్పటికి విజయ్ గారు చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయనలోని సింప్లిసిటీ నన్ను బాగా ఎట్రాక్ట్ చేసింది అంటూ తాజాగా ఓ ఇంట్రవ్యూలో చెప్పుకొచ్చింది రష్మిక. ఇక ఈ అమ్మడు ఇప్పుడు దళపతి విజయ్ తో కలిసి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ డే షూటింగ్ కోసం ఆసక్తిగా వెయిట్ చేశా.. ఆ రోజు క్లాప్ కొట్టిన తర్వాత విజయ్ గారికి దిష్టి తీసి ఆయన పట్ల నాకున్న అభిమానాన్ని చాటుకున్నా.. దిష్టి తీయగానే విజయ్ గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సెట్లో ఉన్న వారంతా తెగ నవ్వేశారు’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :