AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: లక్కు తోక తొక్కిన రష్మిక.. సల్మాన్ సినిమాకు ఎన్ని కోట్లు అందుకుంటుందంటే

తెలుగులో ఈ చిన్నదానికి విపరీతమైన క్రేజ్ ఉంది. చలో సినిమాతో మొదలు పెట్టి ఇప్పుడు పుష్ప 2 వరకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఇక ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటుంది. ఇప్పటికే యానిమల్ సినిమాతో భారీ హిట్ అందుకుంది.

Rashmika Mandanna: లక్కు తోక తొక్కిన రష్మిక.. సల్మాన్ సినిమాకు ఎన్ని కోట్లు అందుకుంటుందంటే
Rashmika
Rajeev Rayala
|

Updated on: May 10, 2024 | 12:18 PM

Share

రష్మిక మందన్న ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తుంది. తెలుగులో ఈ చిన్నదానికి విపరీతమైన క్రేజ్ ఉంది. చలో సినిమాతో మొదలు పెట్టి ఇప్పుడు పుష్ప 2 వరకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఇక ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటుంది. ఇప్పటికే యానిమల్ సినిమాతో భారీ హిట్ అందుకుంది.ఇక ఇప్పుడు బాలీవుడ్‌లో డిమాండ్ ఉన్న నటిగా మారుతోంది. ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో నటించినా స్టార్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రాని నటీమణులు బాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. అయితే రష్మిక మందన్నకు ఈ అవకాశం చాలా త్వరగా దక్కింది. రష్మిక తన మొదటి బాలీవుడ్ సినిమాలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించింది. ఆ తర్వాత రణ్‌బీర్‌ కపూర్‌తో నటించి బ్లాక్‌బస్టర్‌ను అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్ టాప్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో నటిస్తోంది.

సల్మాన్ ఖాన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సికందర్‌’లో హీరోయిన్ గా రష్మిక మందన్న సెలక్ట్ చేశారు. ఈ సినిమాని ఇండియాలోని అగ్ర దర్శకుల్లో ఒకరైన ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేయనున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలను అందించిన సాజిద్ నదియావాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు రష్మిక భారీ పారితోషికం తీసుకుంటోందని టాక్ వినిపిస్తుంది.

సల్మాన్‌ ఖాన్‌తో ఓ సినిమాలో నటించేందుకు రష్మిక మందన్న భారీ పారితోషికాన్ని అందుకుందని అంటున్నారు. గతంలో ఒక్కో సినిమాకు 3-4 కోట్లు పారితోషికం అందుకున్న రష్మిక.  సల్మాన్ ఖాన్ నటించిన ‘సికందర్‌’ చిత్రానికి 50 శాతం అదనంగా( దాదాపు 6 కోట్లు) తీసుకుంటున్నట్లు సమాచారం. సల్మాన్‌ఖాన్‌ సినిమాల్లో హీరోయిన్‌లకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు, కేవలం పాటలు, ఓ రెండు సన్నివేశాలకే పరిమితమవుతారు. కానీ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సికందర్‌’ సినిమాలో పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి రష్మికకు ఈ సినిమాలో తన టాలెంట్ చూపించే మంచి అవకాశం దక్కిందని అంటున్నారు. రష్మిక తెలుగులో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తుంది. అలాగే అల్లు అర్జున్ తో కలిసి  ‘పుష్ప 2’, చేస్తుంది. వీటితోపాటు ‘గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలో నటిస్తోంది. తమిళంలో కొత్త సినిమా ఒకే చేసింది.  టైగర్ ష్రాఫ్‌తో కలిసి రష్మిక ఓ హిందీ సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్