Rashmika Mandanna: ‘చాలా బాధగా ఉంది’.. అల్లు అర్జున్ పుష్ఫ 2 సినిమాపై రష్మిక ఎమోషనల్ పోస్ట్

అల్లు అర్జున్, రష్మిక మందన్నాల క్రేజీ ప్రాజెక్టు పుష్ఫ 2 ఆగమనానికి మరికొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ క్రేజీ మూవీ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా పుష్ఫ 2 సినిమాకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్ డేట్ ఇచ్చింది రష్మిక.

Rashmika Mandanna: ‘చాలా బాధగా ఉంది’.. అల్లు అర్జున్ పుష్ఫ 2 సినిమాపై రష్మిక ఎమోషనల్ పోస్ట్
Pushpa 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 13, 2024 | 6:50 PM

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం తెలుగు ఆడియెన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 నుంచి గ్లింప్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈనెల 17వ తేదీన ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా హీరోయిన్ రష్మిక మందన్న పుష్ప 2 సినిమాపై ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీలో తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ పూర్తి చేసినట్లు ఈ పోస్టులో తెలిపిందీ అందాల తార. తన డబ్బింగ్ ఫోటోలను షేర్ చేస్తూ ‘ఫన్‌, గేమ్స్‌ పూర్తైపోయ్యాయి. వర్క్ లో బిజీ అయ్యాను! పుష్ప ది రూల్‌ షూటింగ్ దాదాపుగా పూర్తైపోయింది. ఫస్టాఫ్‌ డబ్బింగ్‌ పనులు కూడా కంప్లీట్ చేశాను. ఇప్పుడు సెకండాఫ్‌ కోసం డబ్బింగ్‌ చెబుతున్నాను. ఫస్టాఫ్‌ సూపర్బ్ గా ఉంటుంది. ఇక సెకండాఫ్‌ అంతకు మించి ఉంటుంది. ఇది మాటల్లో చెప్పలేను. మీరు కచ్చితంగా మైండ్‌ బ్లోయింగ్‌ ఎక్స్ పీరియెన్స్ ను అందుకుంటారు. ఈ చిత్రాన్ని మీకు చూపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అదే సమయంలో పుష్ఫ 2 షూటింగ్ పూర్తి అవుతున్నందుకు బాధగా ఉంది’ అని రాసుకొచ్చింది రష్మిక.

ప్రస్తుతం రష్మిక మందన్నా షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ రష్మిక పోస్టుని వైరల్ చేస్తూ పుష్ప 2 ఓ రేంజ్ లో ఉండనుందని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ కూడా స్పీడ్ అందుకున్నాయి. నవంబర్ 17న బిహార్ రాజధాని పాట్నాలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అలాగే మరో ఏడు నగరాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహిస్తామని మూవీ యూనిట్ తెలిపింది.

ఇవి కూడా చదవండి

పుష్ఫ 2 డబ్బింగ్ పనుల్లో రష్మిక..

బిహార్ లో పుష్ప 2 ట్రైలర్ లాంఛ్ ఈవెంట్..

Dropping an EXPLOSIVE BANGER before the MASS festival begins in Cinemas ❤‍🔥

Experience the MASSIVE #Pushpa2TheRuleTrailer on 17th November at 6:03 PM 🌋🌋

With a Blasting Event at PATNA 💥💥#Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5th

Icon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/nCFKC4kYA5

— Pushpa (@PushpaMovie) November 11, 2024

డిసెంబర్ 05న గ్రాండ్ రిలీజ్..

The celebrations begin a day earlier 🥳 The fireworks at the box office will set off a day earlier 🔥 The records will be hunted down a day earlier 💥 Pushpa Raj’s Rule will begin a day earlier ❤‍🔥

The Biggest Indian Film #Pushpa2TheRule GRAND RELEASE WORLDWIDE ON 5th… pic.twitter.com/AFckFRWt47

— Pushpa (@PushpaMovie) October 24, 2024

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!