Animal Movie : బాక్సాఫీస్‌ను వేటాడుతున్న యానిమల్.. 9 రోజులకు ఎంత వసూల్ చేసిందంటే..
డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కొంతమంది ఈ సినిమా పై విమర్శలు చేస్తుంటే.. మరికొందరు మాత్రం సినిమాను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో హింస ఎక్కువైందని.. మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని.. అలాగే అసభ్య పదజాలం వాడారు అంటి చాలా విమర్శలు వచ్చాయి. అయినా కూడా 'యానిమల్' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కొంతమంది ఈ సినిమా పై విమర్శలు చేస్తుంటే.. మరికొందరు మాత్రం సినిమాను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో హింస ఎక్కువైందని.. మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని.. అలాగే అసభ్య పదజాలం వాడారు అంటి చాలా విమర్శలు వచ్చాయి. అయినా కూడా ‘యానిమల్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా రణబీర్ కపూర్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘యానిమల్’ సినిమా 9 వ రోజు కూడా యానిమల్ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది.
యానిమల్ సినిమా తొలిరోజు 52 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు రూ.57 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు 61 కోట్లు, నాలుగో రోజు 38 కోట్లు, ఐదో రోజు 32 కోట్లు, 6వ రోజు 26 కోట్లు, 7వ రోజు 22 కోట్లు, 8వ రోజు 21 కోట్లు, 9వ రోజు 34 కోట్లు. ఇప్పటివరకు టోటల్ కలెక్షన్ 344 కోట్ల రూపాయలు వసూల్ చేసింది యానిమల్ సినిమా.
‘యానిమల్’ సినిమా సక్సెస్ కావడంతో రణబీర్ కపూర్ డిమాండ్ పెరిగింది. రణబీర్ నటన పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బాబీ డియోల్, అనిల్ కపూర్, త్రిప్తి దిమ్రీ, రష్మిక మందన్న ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. 2వ వారాంతంలో ‘యానిమల్’ మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందని సినిమా చివర్లో హింట్ ఇచ్చారు. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
The BIGGEST 2nd FRIDAY ever 🔥
Book your Tickets 🎟️ https://t.co/kAvgndK34I#AnimalTakesOverTheNation #AnimalInCinemasNow #Animal #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23… pic.twitter.com/PEGSV2NgZl
— Animal The Film (@AnimalTheFilm) December 9, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



