AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sandeep Reddy Vanga: యానిమల్‌ ఎఫెక్ట్.. సందీప్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన సెలబ్రిటీలు..

యానిమల్‌ సినిమాటిక్‌ బ్రిల్లియన్స్ చూసి మైండ్‌ బ్లోయింగ్‌ అయిందంటూ బన్నీ పెట్టిన మెసేజ్‌ చూసి వావ్‌ అంటున్నారు జనాలు. ఇంకా యానిమల్‌ మూవీ చూడని వాళ్ల గురించి రామ్‌గోపాల్‌ వర్మ చేసిన ట్వీట్‌ కూడా బాగానే వైరల్‌ అవుతోంది. సెలబ్రిటీల అప్రిషియేషన్‌ అందుకుంటున్న సందీప్‌రెడ్డి మీద స్పెషల్‌ ఫోకస్‌ పడుతోంది. 500 కోట్ల మార్కు దాటి వెయ్యి కోట్ల వైపు పరుగులు తీస్తోంది యానిమల్‌. 

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Prudvi Battula|

Updated on: Dec 10, 2023 | 11:09 AM

Share
యానిమల్‌ సినిమాటిక్‌ బ్రిల్లియన్స్ చూసి మైండ్‌ బ్లోయింగ్‌ అయిందంటూ బన్నీ పెట్టిన మెసేజ్‌ చూసి వావ్‌ అంటున్నారు జనాలు. ఇంకా యానిమల్‌ మూవీ చూడని వాళ్ల గురించి రామ్‌గోపాల్‌ వర్మ చేసిన ట్వీట్‌ కూడా బాగానే వైరల్‌ అవుతోంది. సెలబ్రిటీల అప్రిషియేషన్‌ అందుకుంటున్న సందీప్‌రెడ్డి మీద స్పెషల్‌ ఫోకస్‌ పడుతోంది.

1 / 5
500 కోట్ల మార్కు దాటి వెయ్యి కోట్ల వైపు పరుగులు తీస్తోంది యానిమల్‌. ఎ సర్టిఫికెట్‌, భారీ నిడివి, సౌత్‌కి పరిచయం లేని నార్త్ హీరో, బోల్డ్ అటెంప్ట్, వయొలెన్స్ కా బాప్‌ అన్నట్టుండే సన్నివేశాలు.... ఇన్నిటినీ దాటుకుని బాక్సాఫీస్‌ మీద ఎక్స్ ట్రార్డినరీ దండయాత్ర చేస్తోంది యానిమల్‌.

2 / 5
అప్పుడప్పుడే ఇండస్ట్రీకి పరిచయమైన హీరో, ప్రయోగాలకు సిద్ధంగా ఉండే నార్త్ హీరోలు సందీప్‌ స్టోరీలకు సై అంటారు. మరి సలార్‌ హీరో ఏమంటారు? నెక్స్ట్ సందీప్‌ ఫ్రేమ్‌లో స్పిరిట్‌కి సై అంటారా? కాల్షీట్‌ ఇచ్చేముందు సందీప్‌కి స్పెషల్‌గా ఏమైనా కండిషన్లు పెడతారా? ఫలానా సీన్లు వద్దు, ఈ సీన్లు ఇంతవరకూ ఓకే అంటూ ఆంక్షలు పెడతారా? ఈ తరహా చర్చ జరుగుతోంది ప్రభాస్‌ - సందీప్‌ కాంబోలో తెరకెక్కబోయే స్పిరిట్‌ మీద.

3 / 5
ప్రభాస్‌ సినిమా తర్వాత సందీప్‌ రెడ్డి ఖాతాలో ఉన్నది అల్లు అర్జున్‌ సినిమానే. బన్నీ ఇప్పుడు యానిమల్‌ని పొగడ్తలతో ముంచెత్తారు. కాస్త మాస్‌ ఎడ్జ్ తీసుకుని పుష్ప తరహా సినిమా కూడా చేశారు బన్నీ. ఇప్పుడు పుష్ప2తో అసలు తగ్గేదేలే అంటున్నారు. ఈ ఎక్స్ పీరియన్స్ తో సందీప్‌ చెప్పే స్టోరీకి, కేరక్టరైజేషన్‌కీ బన్నీ ఓకే చెప్పేస్తారా? అల్లు అర్మీ ఒప్పుకోరంటూ ఏవైనా పాయింట్లు లేవదీస్తారా? అనేది కూడా చర్చలో ఉన్న విషయం.

4 / 5
ఓటీటీల ప్రభావం వల్ల ఇప్పుడు బోల్డ్ కంటెంట్‌కి, వయొలెన్స్ కి జనాలు కాస్త బాగానే అలవాటు పడ్డారనే అనుకోవాలా? అదే యానిమల్‌కి కోట్లు కొల్లగొట్టిపెడుతోందని ఫిక్సవ్వాలా? 2023లో యానిమల్‌ని యాక్సెప్ట్ చేసిన జనాలు, రానున్న కాలంలో స్పిరిట్‌ని, బన్నీ సినిమానూ సందీప్‌ కంటెంట్‌తో యాక్సెప్ట్ చేయడానికి మానసికంగా ప్రిపేర్‌ అవుతారని భావించాలా? ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా, ఇవి నా మార్కు సినిమాలు అంటూ ఇప్పటికే ఓ ఇంపాక్ట్ క్రియేట్‌ చేశారు సందీప్‌. దాన్ని అర్థం చేసుకుని, మన హీరోలు ఆయన ఫ్రేమ్‌లో ఎలా ఫిట్‌ అవుతారన్నది అందరికీ ఆసక్తి కలిగిస్తున్న విషయం.

5 / 5