- Telugu News Photo Gallery Cinema photos Release of Fighter teaser, Pathaan and War 2 are once again in the news
Fighter: దుమ్మురేపుతున్న ఫైటర్ టీజర్.. దీంతో మరోసారి పఠాన్, వార్ 2 పై చర్చ..
ఫస్ట్ ఏరియల్ యాక్షన్ సినిమాగా ప్రచారంలో ఉంది ఫైటర్. ఆల్రెడీ వార్, పఠాన్‌తో తన మార్క్ క్రియేట్ చేసిన కెప్టెన్ సిద్ధార్థ్ ఆనంద్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫైటర్ మీద ఎక్స్ పెక్టేషన్స్ కూడా మామూలుగా లేవు. దానికి తోడు టీజర్ కూడా గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఇంతకీ ఫైటర్ సౌత్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? టీజర్ చూశారుగా...ఎక్కడ కళ్లార్పితే ఏ షాట్ మిస్ అవుతామో అన్నంత గ్రిప్పింగ్‌గా కట్ చేశారు సిద్ధార్థ్ ఆనంద్.
Updated on: Dec 10, 2023 | 10:47 AM

ఫస్ట్ ఏరియల్ యాక్షన్ సినిమాగా ప్రచారంలో ఉంది ఫైటర్. ఆల్రెడీ వార్, పఠాన్‌తో తన మార్క్ క్రియేట్ చేసిన కెప్టెన్ సిద్ధార్థ్ ఆనంద్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫైటర్ మీద ఎక్స్ పెక్టేషన్స్ కూడా మామూలుగా లేవు. దానికి తోడు టీజర్ కూడా గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఇంతకీ ఫైటర్ సౌత్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది?

టీజర్ చూశారుగా...ఎక్కడ కళ్లార్పితే ఏ షాట్ మిస్ అవుతామో అన్నంత గ్రిప్పింగ్‌గా కట్ చేశారు సిద్ధార్థ్ ఆనంద్. ఆల్రెడీ హృతిక్‌తో ఆయన చేసిన వార్ మూవీకి విపరీతమైన స్పందన వచ్చింది. సౌత్‌లోనూ వార్‌కి స్పెషల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారంటే, ఈ కాంబోకి ఉన్న కరిష్మా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

వార్ డైరక్టర్ తెరకెక్కించిన పఠాన్ సినిమా అనగానే... లాస్ట్ ఇయర్ ఇదే టైమ్‌కి షారుఖ్ మూవీ మీద ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగాయి. వాటిని అంతే గ్రేస్‌తో మీట్ అయ్యారు సిద్ధార్థ్. షారుఖ్, దీపిక పదుకోన్ చేసిన పఠాన్ సినిమా వెయ్యి కోట్లను దాటిన కలెక్షన్లు చూసింది. షారుఖ్ నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న హిట్‌ని అందించేసింది పఠాన్.

పఠాన్‌లో బేషరమ్ పాటలో దుమ్మురేపిన దీపిక పదుకోన్, ఇప్పుడు మిన్నిగా ఫైటర్‌లోనూ మెప్పించడానికి రెడీ అవుతున్నారు. టీజర్‌లో కొన్ని షాట్స్ లో దీపికను చూసిన వారు స్క్రీన్ మీదఈ సారి జబర్దస్త్ గా ఉంటారని ఫిక్సయిపోయారు.

గ్లామర్ యాంగిల్‌లో మాత్రమే కాదు, ఫ్యూచరిస్టిక్ యాంగిల్‌లోనూ ఫైటర్ ట్రైలర్‌ని చూస్తున్నారు మరికొందరు. హృతిక్ హీరోగా తెరకెక్కే నెక్స్ట్ మూవీ వార్2. ఇందులో తారక్ కీ రోల్ చేస్తున్నారు.ఇటీవలే వార్2 మూవీని స్టార్ట్ చేశారు అయాన్ ముఖర్జీ. వచ్చే ఏడాది రిపబ్లిక్ డేకి రిలీజ్ అయ్యే ఫైటర్, సమ్మర్‌లో రిలీజ్ అయ్యే దేవర కలెక్షన్లు... వార్2 ప్రీ రిలీజ్ బిజినెస్ మీద ప్రభావం చూపిస్తాయన్నది ట్రేడ్ పండిట్స్ మాట.




