AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటీ..! రామ్ పోతినేని, ఎన్టీఆర్ బంధువులా..! తారక్‌కు రామ్ ఏమవుతాడో తెలుసా..

జపాన్ లో ఎన్టీఆర్ కు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. తారక్ ప్రస్తుతం బడా సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి హీరోయిన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు.

ఏంటీ..! రామ్ పోతినేని, ఎన్టీఆర్ బంధువులా..! తారక్‌కు రామ్ ఏమవుతాడో తెలుసా..
Ntr
Rajeev Rayala
|

Updated on: Apr 30, 2024 | 5:40 PM

Share

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు తారక్. విదేశాల్లోనూ తారక్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. జపాన్ లో ఎన్టీఆర్ కు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. తారక్ ప్రస్తుతం బడా సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి హీరోయిన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ.. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను కొరటాల రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ బడా మూవీ వార్ 2లోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు కలిసి నటించనున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే తారక్ కు టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని బంధువులు అవుతారని చాలా మందికి తెలియదు.

అవును రామ్ పోతినేని, ఎన్టీఆర్ బంధువులు.. ఇదే విషయాన్ని రామ్ ఓ వేదిక పై స్వయంగా తెలిపాడు. గతంలో ఓ వేదిక పై రామ్ పోతినేని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నాకు వరసకు అన్నయ్య అవుతాడు అని తెలిపాడు. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ అభిమానులు, రామ్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లు ఈ విషయం మనకు తెలియలేదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రామ్ సినిమాల విషయానికొస్తే చివరిగా బోయపాటి దర్శకత్వంలో స్కంద అనే సినిమా చేశాడు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట