AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా ట్రైల‌ర్ తో వ‌ర్మ భ‌య‌పెట్టాడు స‌రే..అస‌లు లాక్‌డౌన్‌లో షూటింగ్ ఎలా చేశాడు..

బ‌ర్నింగ్ టాపిక్స్‌ని తన సినిమా కంటెంట్‌లుగా మార్చుకుని..ప‌బ్లిసిటీ లేకుండానే విప‌రీత‌మైన బ‌జ్ తెచ్చుకుంటారు సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ప్రస్తుతం ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తోన్న‌ కరోనా మహమ్మారిపై రోజుకో వెరైటీ ట్వీట్ తో హ‌ల్ చ‌ల్ చేసిన వ‌ర్మ‌.. అది ఒక పురుగు అంటూ త‌న వాయితో పాడిన సాంగ్ రిలీజ్ చేసి కరోనా కంటే ఎక్కువ భ‌య‌పెట్టాడు. తాజాగా లాక్‌డౌన్‌లోనూ త‌న మార్క్ సినిమాతో ‘కరోనా వైరస్’ ఫీచర్ ఫిల్మ్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు. […]

క‌రోనా ట్రైల‌ర్ తో వ‌ర్మ భ‌య‌పెట్టాడు స‌రే..అస‌లు లాక్‌డౌన్‌లో షూటింగ్ ఎలా చేశాడు..
Ram Naramaneni
|

Updated on: May 26, 2020 | 9:07 PM

Share

బ‌ర్నింగ్ టాపిక్స్‌ని తన సినిమా కంటెంట్‌లుగా మార్చుకుని..ప‌బ్లిసిటీ లేకుండానే విప‌రీత‌మైన బ‌జ్ తెచ్చుకుంటారు సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ప్రస్తుతం ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తోన్న‌ కరోనా మహమ్మారిపై రోజుకో వెరైటీ ట్వీట్ తో హ‌ల్ చ‌ల్ చేసిన వ‌ర్మ‌.. అది ఒక పురుగు అంటూ త‌న వాయితో పాడిన సాంగ్ రిలీజ్ చేసి కరోనా కంటే ఎక్కువ భ‌య‌పెట్టాడు. తాజాగా లాక్‌డౌన్‌లోనూ త‌న మార్క్ సినిమాతో ‘కరోనా వైరస్’ ఫీచర్ ఫిల్మ్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు.

ప్ర‌స్తుతం మ‌నుషుల జీవిన వ్య‌వ‌స్థ‌ను క‌రోనా పూర్తిగా మార్చివేసింది. భ‌య‌ట‌వాళ్లే కాదు..ఇంట్లో వ్య‌క్తి తుమ్మినా, దగ్గినా మ‌నుషులు భ‌యంతో వణికి పోతున్నారు. ఇలాంటి భయంక‌ర పరిస్థితుల్నే కరోనా వైరస్ ట్రైలర్‌లో చూపించారు వర్మ ప్రియ‌ శిష్యుడు అగస్త్య మంజు. కరోనా నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లో భయంతో ప్ర‌జ‌లు ఎలా జీవ‌నం సాగిస్తున్నారు? లాంటి అంశాల‌ను ట‌చ్ చేస్తూ ట్రైల‌ర్ ను ర‌క్తి క‌ట్టించారు. వర్మ చిత్రాల్లో ఎక్కువ‌గా కనిపించే.. శ్రీకాంత్ అయ్యంగార్ ఈ ‘కరోనా వైరస్’ ఫిల్మ్‌లో కీల‌క పాత్ర‌‌ చేశారు. ఒక ఫ్యామిలీలో కరోనావైర‌స్ క్రియేట్ చేసిన భ‌యాన‌క‌ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. అలాగే ట్రైల‌ర్ ఎండింగ్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్‌ల పారాసిటామాల్, బ్లీచింగ్ పౌడర్ డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి. ఈ సినిమా మొత్తాన్ని లాక్‌డౌన్ పీరియడ్‌లో షూట్ చేయడం గ‌మ‌నార్హం. అనేక రూల్స్ మ‌ధ్య షూటింగ్ ఎలా చేశార‌న్న‌ది ఇప్పుడు అంతుబ‌ట్ట‌ని ప్ర‌శ్న‌గా ఉంది. కాగా కరోనా వైరస్ సబ్జెక్ట్ మీద తీసిన ప్రపంచంలోనే తెర‌కెక్కుతున్న ఫ‌స్ట్ సినిమా ఇదే కావడం విశేషం.