Ram Gopal Varma: వరంగల్‌లో సీక్రెట్‌గా పర్యటిస్తున్న వర్మ.. అసలు కారణం అదేనా..
వివాదాల దర్శకుడు వర్మ ఏం చేసిన సంచలనమే.. ఆయన సినిమాలు చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎక్కడ ఏ విషయం జరిగిన దాన్ని సినిమాగా తెరకెక్కించి మరింత రచ్చచేయడం వర్మ నైజం.
Ram Gopal Varma: వివాదాల దర్శకుడు వర్మ ఏం చేసిన సంచలనమే.. ఆయన సినిమాలు చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎక్కడ ఏ విషయం జరిగిన దాన్ని సినిమాగా తెరకెక్కించి మరింత రచ్చచేయడం వర్మ నైజం. వర్మ చెప్పేదాంట్లో నిజం ఉన్నా.. ఎందుకో అందరూ అది ఒప్పుకోరు.. ఇక ఇప్పటికే పలు బయోపిక్‌లతో హాట్ టాపిక్‌గా మారిన వర్మ త్వరలో మరో సంచలనం తెరలేపనున్నాడని తెలుస్తుంది. వర్మ సినిమా తెరకెక్కించడానికి పెద్దగా టైం తీసుకోడు.. సినిమా అనౌన్స్ చేసిన కొద్దిరోజులకే రిలీజ్ అంటూ హడావిడి చేస్తాడు. ఇప్పుడు కూడా వర్మ ఎదో భారీగా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.
తాజాగా వర్మ వరంగల్‌లో సీక్రెట్ పర్యటిస్తున్నారు.. LB కళాశాలలో సిబ్బందిఅలాగే అధ్యాపకులను కలిసి కొంతసేపు రహస్యంగా రాంగోపాల్ వర్మ మాట్లాడినట్టు సమాచారం.. అయితే ఇందుకు కారణం త్వరలోనే వర్మ ఓ వివాదాస్పద బయోపిక్ తీస్తున్నాడని తెలుస్తుంది. కొండా సురేఖ-మురళి లపై బయోపిక్ కోసం వర్మ వారి విద్యాభ్యాసం వివరాలు సేకరించినట్లు సమాచారం. మరి ఈ బయోపిక్ ఎలాంటి వివాదానికి తెరతీస్తుందో చూడలి. ఇక ప్రస్తుతం వర్మ పలు వెబ్ సిరీస్ లతో సిద్ధంగా ఉన్నాడు. లేడీ బ్రుస్ లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు వర్మ.