Bigg Boss Telugu 5: రెండు వారాలకు ఉమాదేవి అంత రెమ్యునరేషన్ తీసుకున్నారా.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
బిగ్ బాస్ సీజన్ 5 లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్‌లో చాల మంది తెలియని మొఖాలే ఉన్నాయి. ఒకరిద్దరు తప్ప పెద్దగా పరిచయం లేని క్యాండెట్స్ ఈసారి హౌస్‌లో చాలా మందే ఉన్నారు.
Bigg Boss Telugu 5: బిగ్ బాస్ సీజన్ 5 లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్‌లో చాల మంది తెలియని మొఖాలే ఉన్నాయి. ఒకరిద్దరు తప్ప పెద్దగా పరిచయం లేని క్యాండెట్స్ ఈసారి హౌస్‌లో చాలా మందే ఉన్నారు. ఇక ప్రేక్షకులకు తెలిసిన వారిలో కార్తీక దీపం ఫేమ్ అర్ధపావు భాగ్యం.. ఉమా దేవి ఒకరు. పలు సినిమాల్లో సీరియల్స్‌లో నటించి ఆకట్టుకున్న ఉమా దేవి. బిగ్ బాస్ సీజన్ 5లో సందడి చేశారు. తనదైన ఆట తీరుతో హౌస్‌లో పెద్దగా వ్యవరిస్తూ ఆకట్టుకున్నారు. అయితే ఊహించని విధంగా హౌస్ నుంచి బయటకు వచ్చేశారు ఉమాదేవి. అయితే టాస్క్‌లసమయంలో అగ్రసివ్‌గా ఉండటం.. ముక్కు సూటిగా మాట్లాడటం.. దాంతో చిన్న విషయానికి కూడా గొడవకు దిగడంతో ఆమె పై ఇంటిసభ్యులు రివర్స్ అయ్యారు. అంతే కాదు బూతులు మాట్లాడటం ఆమెకు మైనస్ అయ్యింది. దాంతో హౌస్‌లో రెండు వారాలు ఉన్న ఉమా దేవి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. బూతులు మాట్లాడకపోయి ఉంటే మరొకొన్ని రోజులు ఆమె బిగ్‌బాస్‌లో కంటిన్యూ అయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అయితే రెండు వారాలు హౌస్‌లో సందడి చేసిన ఉమాదేవి రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. రెండు వారాలకు ఆమె ఎంత ఎమ్యూనరేషన్ తీసుకున్నారన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. అయితే ఈ సీజన్ లో కంటెస్టెంట్స్‌కు భారీగానే చెల్లిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఆ లెక్కన రెండు వారాలకుగానుఉమాదేవికి సుమారు రూ. లక్షా అరవై వేల పారితోషికం అందినట్లు తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :