NTR: కొత్త కారు కోసం ఫ్యాన్సీ నంబర్ దక్కించుకున్న ఎన్టీఆర్.. 9999 నంబర్‌కు ఎంత పెట్టారో తెలిస్తే షాక్..
NTR: కొత్త కార్లను కొనుగోలు చేసే హ్యాబీ సినీ ప్రముఖుల్లో చాలా మందికి ఉంది. అలాంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటి వరుసలో ఉంటారు. ఎప్పటికప్పుడు ఖరీదైన కార్లను..
NTR: కొత్త కార్లను కొనుగోలు చేసే హ్యాబీ సినీ ప్రముఖుల్లో చాలా మందికి ఉంది. అలాంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటి వరుసలో ఉంటారు. ఎప్పటికప్పుడు ఖరీదైన కార్లను సొంతం చేసుకుంటారు ఎన్టీఆర్. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ తాజాగా లంబోర్ఘిని ఊరుస్ కారును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఈ కారును ప్రత్యేకంగా ఇటలీ నుంచి తెప్పించుకున్నారు. ఈ కారు ధర రూ. 3 కోట్లకుపైమాటే అని సమాచారం. అయితే ఇంత ధర పెట్టి కొనుగోలు చేసిన కారు నెంబర్ కోసం ఎన్టీఆర్ భారీగా ఖర్చు పెట్టారు.
తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నంబర్లకు వేలం వేశారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ రూ.17 లక్షలు పెట్టి TS 09 FS 9999 నంబర్ దక్కించుకున్నారు. మంగళవారం జరిగిన అన్ని ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఇదే హయ్యస్ట్ బిడ్ అని అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే గతంలోనూ ఎన్టీఆర్ ఇదే నెంబర్ కోసం రూ. పది లక్షలు ఖర్చు చేశారు. తారక్‌కు ఉన్న కార్లన్నింటికీ ఇదే నంబర్ ఉండడం విశేషం. తారక్‌కు 9999 నంబర్ అంటే ఎందుకంత ఇష్టమన్న దాని వెనకాల ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. తాత రామరావు, తండ్రి హరికృష్ణ కూడా ఇదే నంబర్ కార్లను ఉపయోగించేవారు. కాబట్టి తారక్‌కు ఈ నంబర్ అంటే అంత ఇష్టమని గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఎన్టీఆర్ ట్విట్టర్ ఖాతా కూడా @tarak9999 అనే ఉండడం విశేషం.
ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఇది పూర్తికాగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోతో బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నారు తారక్.
Also Read: Bigg Boss Ariyana: గుడ్ న్యూస్ షేర్ చేసిన అరియనా గ్లోరి.. అంతా దేవుడి చల్లని దీవెన అంటూ..
CCTV Camera: బాత్రూమ్‌లో కెమెరాలు.. హైదరాబాద్‌లో కేటుగాళ్లు అరాచకం.. ఓ యువతి జాగ్రత్తతో..
F3 Movie Shooting Photos: ఎఫ్3 సెట్ లో సందడి చేసిన రాధికా శరత్ కుమార్ ఎఫ్3 షూటింగ్ ఫొటోస్..