CCTV Camera: బాత్రూమ్‌లో కెమెరాలు.. హైదరాబాద్‌లో కేటుగాళ్లు అరాచకం.. ఓ యువతి జాగ్రత్తతో..

మీరు షాపింగ్‌కు కానీ, రెస్టారెంట్‌కు కానీ వెళుతున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. వాష్‌రూమ్‌ వెళ్లినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొందరు కేటుగాళ్లు బాత్రూమ్‌ల్లో కెమెరాలు

CCTV Camera: బాత్రూమ్‌లో కెమెరాలు.. హైదరాబాద్‌లో కేటుగాళ్లు అరాచకం.. ఓ యువతి జాగ్రత్తతో..
Cctv Camera
Sanjay Kasula

|

Sep 22, 2021 | 10:06 PM

మీరు షాపింగ్‌కు కానీ, రెస్టారెంట్‌కు కానీ వెళుతున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. వాష్‌రూమ్‌ వెళ్లినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొందరు కేటుగాళ్లు బాత్రూమ్‌ల్లో కెమెరాలు పెడుతున్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ వన్ డ్రైవ్‌ ఇన్‌లో సేమ్‌ సీన్‌ జరిగింది. ఇటలీ నుంచి వచ్చిన ఓ యువతి నిన్న రాత్రి అక్కడికి వెళ్లింది. వాష్‌రూమ్‌లో కెమెరాను గుర్తించింది. సీలింగ్‌ లైట్‌లో మొబైల్‌ కెమెరా పెట్టారు. అప్పటికే అందులో ఐదు గంటలుగా రికార్డింగ్‌ అవుతోంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కెమెరాను ఎవరు పెట్టారనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు. వన్‌ డ్రైవన్‌ ఇన్‌ యజమానితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

జూబిలీహిల్స్‌ వన్ డ్రైవ్‌ ఇన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు బరితెగించారు. లేడీస్‌ బాత్రూంలో సీసీ కెమెరా పెట్టారు. సడెన్‌గా కెమెరాను గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాత్రూంలో సిసి కెమెరా ఎవరు పెట్టారు. ఎన్ని రోజులులుగా ఉందనే కోణం పోలీసులు విచారిస్తున్నారు. యువతి ఫిర్యాదుతో పోలీసుల వన్ డ్రైవ్ ఇన్ యజమానితో పాటు మరో ఇద్దరు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి: Liquor Shops: మద్యం షాపు యజమానులకు గుడ్‌న్యూస్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్..

Kerala High Court: కేరళ హైకోర్టు మరో సంచలన తీర్పు.. అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu