Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: పాఠాలు చెప్తానని పిలిచి పాడు పని చేశాడు.. మైనర్ బాలికను గర్భవతి చేసిన ఉపాధ్యాయుడు

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే వెకిలిచేష్టలకు పాల్పడ్డాడు. పాఠాలు చెబుతూనే పాడుపని చేశాడు. కామాంధుడి పైశాచికత్వానికి ఓ మైనర్ బాలిక గర్భవతి అయ్యింది.

Crime News: పాఠాలు చెప్తానని పిలిచి పాడు పని చేశాడు.. మైనర్ బాలికను గర్భవతి చేసిన ఉపాధ్యాయుడు
Minor Girl Pregnant
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 23, 2021 | 7:18 AM

Minor Girl Pregnant by Teacher: విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే వెకిలిచేష్టలకు పాల్పడ్డాడు. పాఠాలు చెబుతూనే పాడుపని చేశాడు. కామాంధుడి పైశాచికత్వానికి ఓ మైనర్ బాలిక గర్భవతి అయ్యింది. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో ఫిజిక్ క్లాసులకు దూరమవ్వడంతో.. ట్యూషన్‌కు వెళ్లిన బాలికను లొంగదీసుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ టీచర్. అలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.

తన దగ్గర చదువు నేర్చుకునేందుకు వచ్చిన మైనర్ బాలికను ట్యూషన్‌ మాస్టారు చిన్నా బెదిరించి, లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. ఈ విషయం ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల మేరకు విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన పదోతరగతి విద్యార్థిని (16) మూడేళ్ల నుంచి ఓ ట్యూషన్‌ సెంటర్‌కు వెళుతోంది. ఆ అమ్మాయిపై ట్యూషన్‌ మాస్టారు కన్నేశాడు. మిగిలిన విద్యార్థులంతా వెళ్లిపోయాక.. ‘నీకు తెలివి లేదు.. మేధాశక్తి పెంచుతాను. అందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి’ అంటూ బాలికను లోబర్చుకున్నాడు. కొన్ని రోజులుగా ఆ బాలిక సరిగ్గా తినకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భవతి అని, ఎనిమిదో నెల అని వైద్యులు నిర్ధారిచారు. దీంతో బాలికను కుటుంబసభ్యులు నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందిజ

దీంతో వెంటనే బాధితులు దిశ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. ఈ దారుణానికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు చిన్నాను అదుపులోకి తీసుకున్నామని దిశ డీఎస్పీ త్రినాథ్‌ తెలిపారు. ఇతడికి ఇదివరకే అక్క కుమార్తెతో పెళ్లయిందని, ఉద్యోగం రాకపోవడంతో ట్యూషన్‌ చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండుకు తరలించామన్నారు.

Read Also… Bhishma Niti: తెలియక చేసినా.. పాపం ఎన్ని జన్మలైనా వెంటాడుతుంది.. రాజు దానం చేసే సమయంలో దోషం అంటకుండా ఎలా ఉండాలంటే