AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag Agency: విశాఖ జిల్లాలో దారుణం.. దివ్యాంగురాలిపై అత్యాచారం.. పక్కా స్కెచ్ వేసి..!

విశాఖ ఏజెన్సీలో దారుణం జరిగింది. దివ్యాంగురాలిపై కన్నేసిన ఓ మృగాడు.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒంటరిగా ఉంటున్న ఆమెపై అత్యాచారం చేశాడు.

Vizag Agency: విశాఖ జిల్లాలో దారుణం.. దివ్యాంగురాలిపై అత్యాచారం.. పక్కా స్కెచ్ వేసి..!
Crime News
Ram Naramaneni
|

Updated on: Sep 22, 2021 | 8:09 PM

Share

విశాఖ ఏజెన్సీలో దారుణం జరిగింది. దివ్యాంగురాలిపై కన్నేసిన ఓ మృగాడు.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒంటరిగా ఉంటున్న ఆమెపై అత్యాచారం చేశాడు. బయటకు చెబితే అంతుచూస్తానని బెదిరించాడు. విషయం బయటకు తెలిసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జీకే వీధి మండలం సీలేరులో ఈ దారుణం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..  సీలేరులో దివ్యాంగురాలైన వివాహిత నివాస‌ముంటుంది. పెళ్లి అయిన అయిదు నెల‌ల‌కే భ‌ర్త వ‌దిలేయ‌డంతో త‌ల్లి వ‌ద్దే ఉంటుంది. అయితే బాధితురాలికి త‌మ్ముడికి అనారోగ్యం చేయ‌డంతో త‌ల్లి విజ‌య‌న‌గ‌రం వెళ్లింది. దీంతో ఒంటరిగా ఉంటుంద‌ని గ‌మ‌నించిన వెంకటరావు అనే నిందితుడు…. ఆమెపై కన్నేసి అదనుకోసం వేచి చూశాడు. అర్ధరాత్రి కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటిబయటకు వచ్చిన ఆమెను అపహరించి… చున్నితో నోరు మూసి, ఇంట్లో ఉన్న విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిపివేసి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ విష‌యం ఎవ్వ‌రికీ చెప్పొద్దంటూ హెచ్చ‌రించి మ‌రీ వెళ్లాడు వెంకటరావు. దీంతో భ‌యాందోళ‌నకు గురైన బాధితురాలు.., ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డంతో విష‌యం బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. బాధితురాలి త‌ల్లి సీలేరు నుంచి వచ్చిన వెంటనే త‌ల్లితో విషయం చెప్ప‌డంతో సంఘ‌ట‌న వెలుగు చూసింది. దీంతో స్థానిక వాలంటీర్ మ‌హిళా పోలీసు స‌హాయంతో పోలీసుస్టేష‌న్‌లో ఫిర్యాదు చేసారు. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని వెంకటరావు అదుపులోకి తీసుకుని, బాధితురాలిని వైద్య‌ప‌రీక్ష‌లు కోసం విశాఖ‌ప‌ట్నం త‌ర‌లించారు. నిందితునిపై 376 సెక్ష‌న్ కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు సీఐ అశోక్ కుమార్ తెలిపారు.

మరోవైపు నిందితుడిపై క‌ఠిన చ‌ర్య‌లు తీస‌కోవాల‌ని డిమాండ్ చేస్తూ టీడీపీ, మ‌హిళా సంఘాలు ఆధ్వ‌ర్యంలో సీలేరు మెయిన్‌రోడ్డు కూడ‌లిలో ధ‌ర్నా నిర్వ‌హించారు.

Also Read: Andhra Pradesh: ఈ ఫోటోలో ఉన్న ముగ్గురు మహిళా ఎంపీలు ఎవరో గుర్తుపట్టారా..?

కాలేయాన్ని కడిగిన ముత్యంలా మెరిపించే పండు ఇది.. తప్పక తినాలి
కాలేయాన్ని కడిగిన ముత్యంలా మెరిపించే పండు ఇది.. తప్పక తినాలి
బాబు ఫిజిక్స్ టీచర్.. పాప టెన్త్ స్టూడెంట్..పేరెంట్స్‌కు తెలియకుం
బాబు ఫిజిక్స్ టీచర్.. పాప టెన్త్ స్టూడెంట్..పేరెంట్స్‌కు తెలియకుం
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..!
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..!
సీజన్‌ మారినప్పుడల్లా తుమ్ములు, జలుబు దాడి చేస్తున్నాయా?
సీజన్‌ మారినప్పుడల్లా తుమ్ములు, జలుబు దాడి చేస్తున్నాయా?
పుల్లటి పెరుగుకు బై-బై! ఈ పెరుగు వారం రోజులైనా పులవదు
పుల్లటి పెరుగుకు బై-బై! ఈ పెరుగు వారం రోజులైనా పులవదు
బాలయ్యే కావాలి.. లైన్‌లో ఏకంగా ఎనిమిది మంది డైరెక్టర్స్
బాలయ్యే కావాలి.. లైన్‌లో ఏకంగా ఎనిమిది మంది డైరెక్టర్స్
బూట్లలో దుర్వాసనతో విసిగి పోయారా? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి..
బూట్లలో దుర్వాసనతో విసిగి పోయారా? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి..
శుక్ర సంచారం.. ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు
శుక్ర సంచారం.. ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు
మళ్లీ భారీగా పడిపోయిన వెండి ధర.. హైదరాబాద్‌లో కిలో ఎంతో తెలుసా?
మళ్లీ భారీగా పడిపోయిన వెండి ధర.. హైదరాబాద్‌లో కిలో ఎంతో తెలుసా?
ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై కుక్క దాడి..!
ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై కుక్క దాడి..!