AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor Shops: మద్యం షాపు యజమానులకు గుడ్‌న్యూస్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్..

మద్యం షాపు యజమానులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 2019 -21 సంవత్సరానికి రాష్ట్రంలో రిటైల్ మద్యం షాపుల లైసెన్సులను మరో నెల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Liquor Shops: మద్యం షాపు యజమానులకు గుడ్‌న్యూస్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్..
Liquor Shops
Sanjay Kasula
|

Updated on: Sep 22, 2021 | 3:31 PM

Share

మద్యం షాపు యజమానులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణ‌లో నవంబర్ 1వ తేదీతో ఇప్పుడున్న 2,216 రిటైల్ లిక్క‌ర్ షాపుల లైసెన్సులు ముగియ‌నున్నాయి. ఈ లైసెన్సులు ముగిసిన త‌రువాత మ‌ద్యం షాపుల వేలం ప్ర‌క్రియ ఉంటుంది. 2019 -21 సంవత్సరానికి రాష్ట్రంలో రిటైల్ మద్యం షాపుల లైసెన్సులను మరో నెల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రొహిబిషన్, ఎక్సయిజ్ శాఖ పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఏ-4 రిటైల్ షాపుల లైసెన్సులను ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి ఆ నెల చివరి తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే.. లిక్కర్‌ షాపుల కేటాయింపులోనూ రిజర్వేషన్లు వర్తింపజేయాలని నిర్ణయానికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం విడుదల చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం.. మద్యం షాపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం, షెడ్యూల్డ్‌ కులాలకు 10 శాతం, షెడ్యూల్డ్‌ తెగలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్‌ సర్కార్..

తెలంగాణ ఎక్సైజ్‌ చట్టం 1968లోని సెక్షన్ 17 (1 ) (V ) అనుసరించి ప్రభుత్వం ఏ- 4 రిటైల్ షాపుల లైసెన్సులను 2021 -23 సంవత్సరానికి గాను రిజర్వేషన్లను కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి: Kerala High Court: కేరళ హైకోర్టు మరో సంచలన తీర్పు.. అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి..

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్