Ram Gopal Varma: ‘వ్యూహం’ సినిమాపై సంచలన ఆరోపణలు.. ఊరుకోనంటూ ఆర్జీవీ స్ట్రాంగ్ వార్నింగ్

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీయకపోయినా ఏదో ఒక విషయంతో నిత్యం వార్తల్లో ఉంటాడు. వివాదాలతో సహవాసం చేస్తూ అందరి నోళ్లల్లో నానుతుంటాడు. ఇప్పుడు తనపై వస్తోన్న మరో ఆరోపణకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చాడీ సెన్సేషనల్ డైరెక్టర్.

Ram Gopal Varma: 'వ్యూహం' సినిమాపై సంచలన ఆరోపణలు.. ఊరుకోనంటూ ఆర్జీవీ స్ట్రాంగ్ వార్నింగ్
Ram Gopal Varma
Follow us
Basha Shek

|

Updated on: Dec 07, 2024 | 6:04 PM

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వ్యూహం సినిమా ఎంత వివాదాస్పదమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లను ఇందులో వ్యంగ్యంగా చూపించారంటూ టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అయితే అడ్డంకులన్నీ తొలగిపోయి ఎట్టకేలకు వ్యూహం సినిమా రిలీజైంది. ఇప్పుడు ఈ సినిమాపై మరో ఆరోపణ వినిపిస్తోంది. అదేంటంటే.. వ్యూహం సినిమా కోసం వైసీపీ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా దాదాపుగా రూ2.10 కోట్లు మంజారు చేసిందిని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ విషయంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఈ ఆరోపణలకు వివరణ ఇచ్చారు.

‘వ్యూహం’ సినిమా దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మాత కాగా శ్రీకాంత్‌ ఫైనాన్స్‌ను అందించారు. నా పార్టనర్‌ రవివర్మ సొంతంగా ఫైనాన్షియర్‌ శ్రీకాంత్‌ నుండి ఏపి ఫైబర్‌ నెట్‌ ప్రసారహక్కులను కొనుగోలు చేశారు. ఏపీ ఫైబర్‌నెట్‌ రవివర్మ నుంచి ప్రసార హక్కులను రెండుకోట్ల వ్యయంతో కొనుగోలు చేసింది. కానీ కోటి రూపాయలు మాత్రమే ఎకౌంట్‌కు వచ్చింది. ఇది శ్రీకాంత్, రవివర్మలకు సంబంధించిన ఒప్పందం. ఈ హక్కులు ఏపి ఫైబర్‌నెట్‌కు 60 రోజులపాటు ఇవ్వబడ్డాయి. ఏపి ఫైబర్‌నెట్‌ వారు చెప్పిన ప్రకారం లక్షా యాభైవేల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఆ సమయంలో టీడీపీ ఎలక్షన్‌ కమీషన్‌కి కంప్లైంట్‌ ఇవ్వటంతో ప్రసారాలను నిలిపివేశారు. రవివర్మకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్‌ ఎమౌంట్‌ను ఏపీ ఫైబర్‌నెట్‌ నిలిపివేసింది. తన బకాయి మొత్తం చెల్లించనందున నా పార్టనర్‌ రవివర్మ సివిల్‌ కోర్టులో కేసు పెట్టారు. అలాగే రవివర్మ పైన, నా పైన తప్పుగా ప్రచారం చేసి మా పరువుకు భంగం కలిగించిన కొన్ని టీవి ఛానల్స్‌ పై నష్ట పరిహారం కోసం కేసులు పెడుతున్నాం’ అని వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

రామ్ గోపాల్ వర్మ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి