AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 Collections: బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రభంజనం.. రెండు రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే..

భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోన్న సినిమా పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటవిశ్వరూపం చూసి ఫిదా అవుతున్నారు అడియన్స్. మొదటి రోజే రూ.294 కోట్లతో సత్తా చాటిన పుష్పరాజ్.. ఇప్పుడు రెండు రోజు సైతం అదే దూకుడు కొనసాగిస్తున్నాడు.

Pushpa 2 Collections: బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రభంజనం.. రెండు రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే..
Pushpa 2
Rajitha Chanti
|

Updated on: Dec 07, 2024 | 6:08 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. డిసెంబర్ 5న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ, రష్మిక మందన్నా యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే డైరెక్టర్ సుకుమార్ టేకింగ్, డైరెక్షన్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ సినిమా మొదటి రోజే రూ.294 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇండియన్ సినిమాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా పుష్ప 2 నిలిచింది. ఇక ఇప్పుడు రెండో రోజు సైతం అదే దూకుడు కొనసాగిస్తుంది.

పుష్ప 2 చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.449 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రయూనిట్ ప్రత్యేకంగా ఓ పోస్టర్ షేర్ చేసింది. ఈ క్రమంలోనే భారతీయ సినీ చరిత్రలో రెండు రోజుల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ఈ మూవీ రికార్డులను క్రియేట్ చేసినట్లుగా వెల్లడించింది మూవీ టీం. దీంతో ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2 చిత్రం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.

ఇక ఈ సినిమా జోరు చూస్తుంటే వారం రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని అభిప్రాయపడుతున్నారు సినీ విశ్లేషకులు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించగా.. జగపతి బాబు, రావు రమేశ్, ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలకపాత్రలు పోషించారు. అలాగే ఇందులో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us