Kalki 2898 AD: కల్కి రిలీజ్ ట్రైలర్‌పై ఆర్జీవీ పజిల్.. లక్ష ఇస్తానంటూ బంపరాఫర్.. మీరేమైనా ట్రై చేస్తారా?

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 AD. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తోన్న ఈ సినిమా రిలీజ్ కు ముహూర్తం దగ్గర పడింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న కల్కి జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్లలో మరింత స్పీడ్ పెంచారు మేకర్స్.

Kalki 2898 AD: కల్కి రిలీజ్ ట్రైలర్‌పై ఆర్జీవీ పజిల్.. లక్ష ఇస్తానంటూ బంపరాఫర్.. మీరేమైనా ట్రై చేస్తారా?
Prabhas, Ram Gopal Varma
Follow us
Basha Shek

|

Updated on: Jun 22, 2024 | 9:53 AM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 AD. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తోన్న ఈ సినిమా రిలీజ్ కు ముహూర్తం దగ్గర పడింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న కల్కి జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్లలో మరింత స్పీడ్ పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా శుక్రవారం (జూన్21) సాయంత్రం కల్కి రిలీజ్ ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీనిని చూసిన వారందరూ వావ్ అని అంటున్నారు. ఫస్ట్ ట్రైలర్ తో కాస్త నిరాశగా ఉన్నామని, కానీ రిలీజ్ ట్రైలర్ తో బ్లాక్ బస్టర్ సంకేతాలు వచ్చాయంటున్నారు ఫ్యాన్స్. ఇందులోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా హాలీవుడ్‌ సినిమాను తలపిస్తున్నాయంటున్నారు. ఇక ప్రభాస్, అమితాబ్ ల మధ్య యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా అదిరిపోయాయని టాక్ వినిపిస్తోంది. తాజాగా కల్కి రిలీజ్ ట్రైలర్ ను చూసి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఫిదా అయ్యాడు. ప్రభాస్ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. అయితే ఇదే సందర్భంగా తనట్విట్టర్ లో కల్కి రిలీజ్ ట్రైలర్ ను షేర్ చేసి ఏదో ఒక పజిల్ ఇచ్చాడు. అందులో కొన్ని పదాలు ఇచ్చి మధ్యలో లెటర్లను మిస్ చేశాడు. దీనిని ముందుగా ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్లకి లక్ష ఇస్తానంటూ ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చారు.

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ప్రభాస్ కల్కి సినిమాను ప్రమోట్ చేసే బాధ్యతను ఆర్జీవీ తీసుకున్నాడంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే.. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ భామ దీపిక పదుకొణె హీరోయిన్ గా నటించింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, శోభన తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీ దత్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కల్కి సినిమాను నిర్మించారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లో కల్కి సినిమా రికార్డులు కొల్లగొడుతోంది.\

ఇవి కూడా చదవండి

ఆర్జీవీ పజిల్ ఇదిగో..

కల్కి రిలీజ్ ట్రైలర్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!