AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parle G : పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ మీదుండే పాప సుధామూర్తి కాదు.. అసలు విషయం ఇదే..

అంతేకాకుండా ఈ బిస్కెట్ ప్యాకెట్, పేరు, అలాగే ప్యాకెట్ పై కనిపించే పాప ఫోటోకు అనేక వార్తలు వినిపిస్తుంటాయి. పార్లేజీ.. జీ అంటే జీనియస్ అని అంటారు. కానీ జీ అంటే గ్లూకోజ్ అని చాలా తక్కువ మందికి తెలుసు.. అలాగే ఆ ప్యాకెట్ పై కనిపించే పాప సదరు సంస్థ కూతురని.. అలాగే ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి భార్య సుధామూర్తి అంటారు.

Parle G : పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ మీదుండే పాప సుధామూర్తి కాదు.. అసలు విషయం ఇదే..
Parle G
Rajitha Chanti
|

Updated on: Jun 22, 2024 | 9:42 AM

Share

పార్లేజీ బిస్కెట్ భారతీయులకు చాలా దగ్గరి సంబంధం ఉంది. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల బ్రాండ్స్, స్టైలీష్ బిస్కెట్స్ కనిపించినా.. పార్లేజీ బిస్సెట్స్ ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఎన్నో సంవత్సరాలుగా ఈ బిస్కెట్స్ మార్కెట్లో ఉన్నాయి. అంతేకాకుండా ఈ బిస్కెట్ ప్యాకెట్, పేరు, అలాగే ప్యాకెట్ పై కనిపించే పాప ఫోటోకు అనేక వార్తలు వినిపిస్తుంటాయి. పార్లేజీ.. జీ అంటే జీనియస్ అని అంటారు. కానీ జీ అంటే గ్లూకోజ్ అని చాలా తక్కువ మందికి తెలుసు.. అలాగే ఆ ప్యాకెట్ పై కనిపించే పాప సదరు సంస్థ కూతురని.. అలాగే ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి భార్య సుధామూర్తి అంటారు.

కానీ ఇప్పుడు పార్లేజీ బిస్కెట్ గురించి అన్ని విషయాలకు క్లారిటీ వచ్చేసింది. ఇటీవల సదరు సంస్థ మార్కెటింగ్ హెడ్ ఓ ఇంటర్య్యూలో పార్లేజీ ప్యాకెట్ పై పాప ఫోటో గురించి క్లారిటీ ఇచ్చేశారు. పార్లేజీ బిస్కెట్ ప్యాక్ మీద ఉండే పాప ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి భార్య సుధామూర్తి కాదట. పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ మీదుండే పాప నిజానికి ఈ ప్రపంచంలోనే లేదని.. ఆమె రియల్ కాదని.. కేవలం అది తమ ఏజెన్సీ ఊహాల నుంచి పుట్టిన చిత్రం అని అన్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్లేజీ సంస్థ మార్కెటింగ్ హెడ్ కృష్ణారావు బుద్దా మాట్లాడుతూ.. పార్లేజీ కంపెనీ ప్రస్థానం, ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకెళ్లడం గురించి వారు చేసే ప్రయత్నాలు తెలిపారు.

అలాగే పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ పాప గురించి అడగ్గా.. కేవలం తను గ్రాఫిక్స్ అని.. కేవలం తమ ఏజెన్సీ సభ్యుల ఆలోచనల నుంచి పుట్టిన పాప అని అన్నారు. వ్యాపార రంగంలో మార్కెటింగ్ రంగంలోకి రావాలనుకునేవారికి అనేక సూచనలు ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us